AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేందయ్యా ఇది..! ఈ ఫొటోలో వెంకటేష్ కాకుండా ఓ స్టార్ హీరో, టాప్ డైరెక్టర్ ఉన్నారు ఎవరో కనిపెట్టారా.?

సినీ సెలబ్రెటీలకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ఆ ఫోటోలను అభిమానులు నెట్టింట షేర్ చేస్తూ సందడి చేస్తుంటారు. అలాంటి ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. వెంకటేష్ తో ఉన్నవారిలో ఓ స్టార్ హీరో, అలాగే ఓ స్టార్ డైరెక్టర్ కూడా ఉన్నారు.

ఇదేందయ్యా ఇది..! ఈ ఫొటోలో వెంకటేష్ కాకుండా ఓ స్టార్ హీరో, టాప్ డైరెక్టర్ ఉన్నారు ఎవరో కనిపెట్టారా.?
Venkatesh
Rajeev Rayala
|

Updated on: Oct 23, 2024 | 8:58 PM

Share

విక్టరీ వెంకటేష్.. ఆయన సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ఆయన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో వైవిధ్యమైన సినిమాలు, రకరకాల పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు.. ఇప్పటికీ మెప్పిస్తున్నారు వెంకటేష్. ఓ వైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్స్ తో కలిసి నటించారు వెంకటేష్. సినిమాలతో పాటు రానా నాయుడు వంటి వెబ్ సిరీస్ తో డిజిటల్ వరల్డ్ లోకి కూడా అడుగుపెట్టారు. ఇక వెంకటేష్ ఇప్పటికి కూడా యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే వెంకటేష్ కు సంబందించిన ఓ ఓల్డ్ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా వెంకటేష్ తో పాటు ఆ ఫొటోలో ఓ స్టార్ హీరో కూడా ఉన్నాడు.

ఇది కూడా చదవండి : Actress : రెండు పెళ్లిళ్లు, ఇద్దరు పిల్లలు.. రెండుసార్లు విడాకులు.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా..

పైన కనిపిస్తున్న ఫోటో చూశారా..? వెంకటేష్ నటించిన ఒకప్పటి సినిమా షూటింగ్ లోని ఫోటో అది. ఆ ఫొటోలో వెంకటేష్ కాకుండా ఓ స్టార్ హీరో అలాగే ఓ స్టార్ డైరెక్టర్ కూడా ఉన్నారు గుర్తుపట్టారా..? అస్సలు గుర్తుపట్టలేరు. అంతలా మారిపోయారు ఆ ఇద్దరు. ఒకరేమో స్టార్ హీరోగా రాణిస్తున్నారు.. మరొకరు టాప్ దర్శకుడిగా దూసుకుపోతున్నారు. ఇంతకు ఆ ఇద్దరు ఎవరో కనిపెట్టరా..? ఆ ఇద్దరూ వెంకటేష్ తో కలిసి పని చేశారు కూడా.? ఇప్పటికైనా కనిపెట్టారా.?

ఇది కూడా చదవండి :దొరికేసింది మావ.. మొత్తానికి దొరికేసింది.. సోషల్ మీడియాను షేక్ చేసిన ఈ బ్యూటీ ఎవరంటే

వెంకటేష్ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉండేది. అలాగే ఆ నటించిన సినిమాలకు పని చేసిన చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఇప్పుడు టాప్ డైరెక్టర్స్ గా మారారు. అలాగే ఆయనతో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ లు హీరోలు, హీరోయిన్స్ గా నూ మారిపోయారు. కాగా పై ఫొటోలో నవ్వుతు ఉన్న పిల్లడు హీరో రామ్ పోతినేని.. అలాగే రెండో సర్కిల్ లో ఉన్నది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఇప్పుడు ఈ త్రో బ్యాక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ తో కలిసి వెంకటేష్ మసాలా అనే సినిమా చేశారు. అలాగే త్రివిక్రమ్ వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు మాటలు రాశారు.

View this post on Instagram

A post shared by RAm RaPo (@rapo_dhf_fan)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..