Tollywood: శ్రీదేవితో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? స్టార్ హీరోగారి భార్య కూడా ఆమె

ఒకప్పుడు అభిమాన హీరో, హీరోయిన్స్ ఫోటోలను పేపర్ కట్స్ ను పుస్తకాల్లో, లేదా రూమ్ గోడల పై అంటించుకొని ఆరాధించే వారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వాడకం ఎక్కువ కావడంతో ఫ్యాన్ పేజ్ లను క్రియేట్ చేసి ఫేవరెట్  హీరోయిన్ ఫోటోలను షేర్ చేస్తున్నారు.

Tollywood: శ్రీదేవితో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? స్టార్ హీరోగారి భార్య కూడా ఆమె
Tollywood
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 22, 2024 | 7:10 AM

సినిమా సెలబ్రెటీలకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాని నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తమ అభిమాన హీరో, హీరోయిన్స్ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఒకప్పుడు అభిమాన హీరో, హీరోయిన్స్ ఫోటోలను పేపర్ కట్స్ ను పుస్తకాల్లో, లేదా రూమ్ గోడల పై అంటించుకొని ఆరాధించే వారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వాడకం ఎక్కువ కావడంతో ఫ్యాన్ పేజ్ లను క్రియేట్ చేసి ఫేవరెట్  హీరోయిన్ ఫోటోలను షేర్ చేస్తున్నారు. చిన్ననాటి ఫోటోల నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ ఫోటో తెగ వైరల్ అవుతుంది. సినీ ఇండస్ట్రీలో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీదేవి గురించి తెలియని వారు ఉండరేమో.. ఆమె అందం, అభినయం ఇప్పటికీ ప్రేక్షకుల కళ్లలో కదలాడుతూ ఉంటాయి.

ఇది కూడా చదవండి : విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి భార్య అరాచకం.. సోషల్ మీడియా షేక్ అవుతుందిగా..

కాగా పై ఫొటోలో శ్రీదేవితో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఆమె మరెవరో కాదు.. స్టార్ హీరోయిన్.. అలాగే ఓ స్టార్ హీరో భార్య కూడా.. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఆ చిన్నది. ఇంతకూ ఆమె ఎవరో కాదు స్టార్ హీరోయిన్ జ్యోతిక. నటి జ్యోతిక చిన్నప్పటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది.. ఈ హీరోయిన్ టక్కరిదొంగ ముద్దుగుమ్మా..! ఎంతగా మారిపోయింది.!!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ నగ్మా చెల్లెలు జ్యోతిక. 1990లలో తమిళ చిత్రసీమలో ప్రముఖ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన 1998 హిందీ చిత్రం ‘డోలి సజా కే రాగ్నా’లో ఆమె నటిగా రంగప్రవేశం చేసింది. బాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన జ్యోతిక అజిత్ నటించిన వాలి సినిమాలో అతిధి పాత్రలో కనిపించింది.జ్యోతిక తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ, హిందీ సినిమాల్లో నటించింది. తెలుగులో మెగాస్టార్ ఠాగూర్ సినిమాతో పరిచయం అయ్యింది. అలాగే జ్యోతిక నటించిన చంద్రముఖి సినిమా ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. 2006 సెప్టెంబరు 11న స్టార్ హీరో సూర్యను వివాహమాడింది.

View this post on Instagram

A post shared by Jyotika (@jyotika)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే