ఉగాది పర్వదినం సందర్భంగా కడపలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ముస్లిం భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. బీబీ నాంచారమ్మను తమ ఆడబిడ్డగా భావిస్తూ, తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. బియ్యం, కందిపప్పు, బెల్లం, కొబ్బరి సమర్పించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.