AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: మొన్నటివరకు హైదరాబాద్ ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్కర్.. ఇప్పుడు టాలీవుడ్‌లో బిజీ యాక్టర్.. ఎవరో తెలుసా?

సాధారణంగా ఎవరైనా ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాక అయ్యో.. రామా? అంటూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటారు. కానీ ఈయన మాత్రం ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయ్యాక సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీ ఆర్టిస్టుగా మారిపోయాడు.

Tollywood: మొన్నటివరకు హైదరాబాద్ ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్కర్.. ఇప్పుడు టాలీవుడ్‌లో బిజీ యాక్టర్.. ఎవరో తెలుసా?
Tollywood Actor
Basha Shek
|

Updated on: Mar 20, 2026 | 11:58 AM

Share

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న బిజీ ఆర్టిస్టులో ఈయన కూడా ఒకరు. స్టార్ హీరోల సినిమాల్లో సహాయక నటుడిగా, కమెడియన్ గా నటిస్తోన్న ఆయన మన తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే. 2018లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన గుర్తింపు తెచ్చుకోవడానికి కొంచెం ఎక్కువ సమయమే పట్టింది. మొదట్లో రంగ స్థలం, మార్షల్, స్కై ల్యాబ్, అంతరిక్షం 9000 KMPH వంటి కొన్ని సినిమాల్లో చిన్న చితకా పాత్రలు పోషించాడు. అవేవీ ఆయనకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేకోయాయి. కానీ 2022లో వచ్చిన డీజే టిల్లు ఈ నటుడి లైఫ్ ను టర్న్ చేసింది. అందులో ఆయన యాక్టింగ్ కు అందరూ ఫిదా అయిపోయారు. కడుపుబ్బా నవ్వుకున్నారు. అక్కడితో మొదలైన ఆయన సినీ ప్రయాణం సక్సెస్ ఫుల్ గా కొనసాగింది. వరుసగా సినిమా అవకాశాలు తలుపు తట్టాయి. హీరోలు, హీరోయిన్లకు తండ్రిగా, బాబాయిగా, మామగా, పెద్దనాన్నగా, తాతగా.. ఇలా అన్ని పాత్రల్లో ఇమడిపోతున్నారు. ఇక 2023లో వచ్చిన బలగం సినిమాలో అయితే తన నటనతో ఆడియెన్స్ ను ఏడిపించేశారీ నటుడు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో దూసుకుపోతోన్న ఆ నటుడు మరెవరో కాదు మురళీధర్ గౌడ్

ఇవి కూడా చదవండి

ఐరేని మురళీధర్‌ గౌడ్‌ తెలంగాణ రాష్ట్రం లోని మెదక్ జిల్లా రామాయం పేటలో జన్మించారు. సిద్దిపేటలో విద్యాభాస్యం పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లోని ఎలక్ట్రిసిటీ బోర్డ్‌లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేశారు మురళీ ధర్ రావు. సుమారు  27 ఏళ్లు అక్కడ పనిచేసిన ఆయన 2012లో పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. డీజే టిల్లు, బలగం, మేమే ఫేమస్, మ్యాడ్, టిల్లు స్క్వేర్, మ్యాడ్, భగవంత్ కేసరి, దాస్ కా దమ్కీ, డార్లింగ్, పుష్ప 2, మంగళవారం, సంక్రాంతికి వస్తున్నాం, మ్యాడ్ స్క్వేర్ కింగ్ డమ్, దండోరా, కే- ర్యాంప్ తదితర సినిమా్ల్లో సహాయ నటునిగా మెప్పించారు మురళీధర్ గౌడ్.

మురళీ ధర్ గౌడ్ లేటెస్ట్ ఫొటోస్..

ఇక ఈ ఏడాది మురళీధర్ నటించిన మూడు సినిమాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. భర్త మహాశయులకు విజ్ఞప్తి, బరాబర్ ప్రేమిస్తా, ఫంకీ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారాయన. అయితే ఇటీవల ఈ నటుని ఫ్యామిలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన భార్య శశికళ కొన్ని రోజుల క్రితమే కన్నుమూశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..