మొత్తానికి కనిపెట్టేశారు మావ..! ఖలేజా సినిమా దిలావర్ సింగ్ భార్య గుర్తుందా..?

ఇంతవరకు పాన్ ఇండియా సినిమా చేయనప్పటికీ మహేష్ కూడా దేశవ్యాప్తంగానే కాదు ఇతర దేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిల్లో మహేష్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. తమకు కాబోయేవాడు మహేష్ లా హ్యాండ్సమ్ గా ఉండాలని కోరుకుంటుంటారు.

మొత్తానికి కనిపెట్టేశారు మావ..! ఖలేజా సినిమా దిలావర్ సింగ్ భార్య గుర్తుందా..?
Khaleja
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 19, 2024 | 12:52 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పండగే.. ఆయన సినిమాల రిలీజ్ లను జాతర జరుపుకుంటారు ఫ్యాన్స్. ఇంతవరకు పాన్ ఇండియా సినిమా చేయనప్పటికీ మహేష్ కూడా దేశవ్యాప్తంగానే కాదు ఇతర దేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిల్లో మహేష్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. తమకు కాబోయేవాడు మహేష్ లా హ్యాండ్సమ్ గా ఉండాలని కోరుకుంటుంటారు. ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే .. ప్రస్తుతం సూపర్ స్టార్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జనవరి నుంచి మొదలు కానుంది. ఈ సినిమాలో మహేష్ బాబు నయా లుక్ లో కనిపించనున్నారు. అయితే మహేష్ బాబు నటించిన సినిమాలు ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకునేవి.

ఇదికూడా చదవండి : విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి భార్య అరాచకం.. సోషల్ మీడియా షేక్ అవుతుందిగా..

మహేష్ నటించిన సినిమాల్లో ఖలేజా సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ సినిమా థియేటర్స్ లో పెద్దగా ఆడలేదు. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా చాలా మందికి ఫేవరెట్ మూవీ. అసలు ఖలేజా సినిమా ఎందుకు ఆడలేదు కూడా చాలా మందికి అర్ధం కాలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో డైలాగ్స్, మహేష్ బాబు యాటిట్యూడ్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. అలాగే ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం కూడా అలరిస్తుంది. మహేష్ కు జోడీగా ఈ సినిమాలో అనుష్క నటించింది.

ఇది కూడా చదవండి : అవును నిజం..! ఈవిడ.. ఆవిడే.. 10th క్లాస్ హీరోయిన్ను చూసి అవాక్ అవుతున్న నెటిజన్స్

కాగా ఈ సినిమాలో కొంత భాగం రాజస్థాన్ లో జరుగుతుంది. టాక్సీ డ్రైవర్ అయినా హీరో.. తన కారుపై పడి చనిపోయిన దిలావర్ సింగ్ అనే వ్యక్తి కుటుంబాన్ని కలవడానికి రాజస్థాన్ వెళ్తాడు. అయితే ఈ సీన్స్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కొంతమంది ఈ సినిమాలో దిలావర్ సింగ్ భార్యగా నటించిన నటి గురించి ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు సంబందించిన వీడియోలు, ఆమె ఎవరో చెప్పండ్రా అంటూ చేసిన ఫన్నీ వీడియోలు వైరల్ గా మారాయి. ఆమె కోసం కుర్రాళ్ళు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో గాలించారు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె పేరు దివ్య మేరీ సిరియాక్. ఆమె గతంలో పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ.

ఇది కూడా చదవండి : మాఫియా డాన్‌తో దోస్తానా.. చేతులారా కెరీర్ నాశనం చేసుకుంది.. చివరకు జైల్లో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హార్దిక్ బాటలోనే మరో టీమిండియా క్రికెటర్.. భార్యతో విడాకులు!
హార్దిక్ బాటలోనే మరో టీమిండియా క్రికెటర్.. భార్యతో విడాకులు!
ఓరీ దేవుడో ఇదేం ఇడ్లీరా సామీ.. అచ్చం బొగ్గులాగే ఉన్నాయ్..!
ఓరీ దేవుడో ఇదేం ఇడ్లీరా సామీ.. అచ్చం బొగ్గులాగే ఉన్నాయ్..!
వాషింగ్‌ మెషీన్‌లో దుప్పట్లను ఉతకవచ్చా..? నిపుణులు ఏమంటున్నారు?
వాషింగ్‌ మెషీన్‌లో దుప్పట్లను ఉతకవచ్చా..? నిపుణులు ఏమంటున్నారు?
ఈ క్రిస్మస్‌కి ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ కేక్ చేయండి.. టేస్ట్ సూపర్!
ఈ క్రిస్మస్‌కి ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ కేక్ చేయండి.. టేస్ట్ సూపర్!
ఆ ఐఫోన్లపై బంపర్ ఆఫర్.. నమ్మలేని తగ్గింపులు మీ సొంతం
ఆ ఐఫోన్లపై బంపర్ ఆఫర్.. నమ్మలేని తగ్గింపులు మీ సొంతం
లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఐదుగురు జవాన్లు మృతి
లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఐదుగురు జవాన్లు మృతి
'చూడముచ్చటైన జంట'.. పీవీ సింధు-సాయిల పెళ్లి ఫొటోలు చూశారా?
'చూడముచ్చటైన జంట'.. పీవీ సింధు-సాయిల పెళ్లి ఫొటోలు చూశారా?
ఉష్ణోగ్రతను బట్టి రంగులు మార్చే ఫోన్‌.. భారత్‌లో లాంచ్‌ ఎప్పుడు?
ఉష్ణోగ్రతను బట్టి రంగులు మార్చే ఫోన్‌.. భారత్‌లో లాంచ్‌ ఎప్పుడు?
వేగంగా వెళ్తున్న కారు గ్లాస్‌పై గగ్గుర్పాటు కలిగించే దృశ్యం..!
వేగంగా వెళ్తున్న కారు గ్లాస్‌పై గగ్గుర్పాటు కలిగించే దృశ్యం..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!