AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాఫియా డాన్‌తో దోస్తానా.. చేతులారా కెరీర్ నాశనం చేసుకుంది.. చివరకు జైల్లో

అప్పట్లో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చాలా మంది హీరోయిన్ ను అందులోనూ ముఖ్యంగా బాలీవుడ్ భామలను టాలీవుడ్ కు పరిచయం చేశారు. అలాగే ఇంకొంతమంది హీరోయిన్స్ కూడా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.

మాఫియా డాన్‌తో దోస్తానా.. చేతులారా కెరీర్ నాశనం చేసుకుంది.. చివరకు జైల్లో
Actress
Rajeev Rayala
|

Updated on: Oct 18, 2024 | 6:58 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కొత్తగా పరిచయం అయ్యారు. ఇప్పటితో పోల్చుకుంటే ఒకప్పుడు ఎంతో మంది హీరోయిన్స్ పరిచయం అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. అప్పట్లో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చాలా మంది హీరోయిన్ ను అందులోనూ ముఖ్యంగా బాలీవుడ్ భామలను టాలీవుడ్ కు పరిచయం చేశారు. అలాగే ఇంకొంతమంది హీరోయిన్స్ కూడా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. వారిలో ఒకరే పైన కనిపిస్తున్న భామ. శ్రీకాంత్ హీరోగా నటించిన అందమైన ప్రేమ కథ చిత్రం తాజ్ మహల్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఆ ముద్దుగుమ్మ. ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసింది. అదే సమయంలో హిందీలోనూ అవకాశాలు అందుకుంది.

ఇది కూడా చదవండి : ఎంత మోసం..! మసూద అని ముసుగేసారు కదరా..! ఇంత అందమైన అమ్మాయిని దెయ్యాన్ని చేశారు

ఆ అమ్మడు ఎవరో కాదు మోనికా బేడి. పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లా చబ్బేవాల్ గ్రామంలో జన్మించింది ఈ అందాల భామ. ఆమె తల్లిదండ్రులు 1979లో నార్వేలోని డ్రామెన్‌కి మారారు. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యాభ్యాసం పూర్తి చేసింది. తెలుగులో ఈ అమ్మడు తాజ్ మహల్,శివయ్య , సోగ్గాడి పెళ్ళాం, సర్కస్ సత్తిపండు, చూడాలని వుంది (1998) స్పీడ్ డాన్సర్‌ లాంటి సినిమాల్లో నటించింది. అలాగే సురక్షతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

ఇది కూడా చదవండి :అందచందాలు అదిరిపోయాయి.. కానీ వెనకాల కూడా చూసుకోవాలి కదమ్మా..!

అయితే ఈ అమ్మడి కెరీర్ పీక్ లో ఉండగానే పలు వివాదాల్లోనూ చిక్కుకుంది. సెప్టెంబరు 2002లో, నకిలీ పత్రాలపై దేశంలోకి ప్రవేశించినందుకు పోర్చుగల్‌లో ఆమెతో పాటు అబూ సలేం అనే భారతీయ గ్యాంగ్‌స్టర్ అరెస్టు చేశారు. ఆ తరువాత జైలు శిక్ష కూడా అనుభవించింది. 2006లో, ఫేక్ పేరుతో పాస్‌పోర్ట్ తెచ్చుకున్నందుకు ఆమెని భారత న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. ఇలా ఈ అమ్మడు చేతులారా కెరీర్ ను నాశనం చేసుకుంది. హిందీ బిగ్ బాస్ సీజన్ 2లో మోనికా  పాల్గొంది. అలాగే పలు టీవీ షోలు కూడా చేసింది మోనికా బేడి. ఇక సొషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నదాని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : Chiranjeevi: ఏంటీ..! చిరంజీవి పెద్ద కూతురు హీరోయిన్‌గా చేసిందా..! డైరెక్టర్ ఎవరో తెలుసా.?

View this post on Instagram

A post shared by Monica Bedi (@memonicabedi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల