- Telugu News Photo Gallery Cinema photos Pawan kalyan's Hari Hara Veera Mallu Vs OG Movie Release date updates, Details here, Telugu Heroes Photos
Pawan kalyan: నాతో నాకే పోటీ అంటున్న పవర్‌స్టార్.! ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ అప్డేట్..
నాకు ఎవరితోనూ పోటీ లేదు.. నాతో నాకే పోటీ.. ఈ మాట అన్నీ ఇండస్ట్రీల్లోనూ వినిపిస్తుందా? లేదా? అనేది భారీ చర్చ. మిగిలిన ఇండస్ట్రీల సంగతి కాసేపు పక్కనపెడితే మన దగ్గర మాత్రం ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. నాతో నాకే పోటీ.. అనే మాట ఇప్పుడు పవర్‌స్టార్‌కి చాలా బాగా సూటవుతుందని వాళ్లల్లో వాళ్లే మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్. ఇంతకీ దేని గురించి ఈ పోటీ డిస్కషన్.. పవర్‌స్టార్ కెరీర్‌లో ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమా హరిహరవీరమల్లు..
Updated on: Oct 22, 2024 | 9:46 AM

నాకు ఎవరితోనూ పోటీ లేదు.. నాతో నాకే పోటీ.. ఈ మాట అన్నీ ఇండస్ట్రీల్లోనూ వినిపిస్తుందా? లేదా? అనేది భారీ చర్చ.

మిగిలిన ఇండస్ట్రీల సంగతి కాసేపు పక్కనపెడితే మన దగ్గర మాత్రం ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. నాతో నాకే పోటీ.. అనే మాట ఇప్పుడు పవర్‌స్టార్‌కి చాలా బాగా సూటవుతుందని వాళ్లల్లో వాళ్లే మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్.

ఆయన కాల్షీట్లు అందుబాటులోకి వచ్చేసరికి, ఉస్తాద్ టీమ్ పక్కా స్క్రిప్టుతో రెడీ అవుతుందన్నది ఫ్యాన్స్ ని ఊరిస్తున్న మాట.

లుక్ నుంచి ఇప్పటిదాకా విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ చూసిన తర్వాత మరో రేంజ్ సినిమా అవుతుందనే కాన్ఫిడెన్స్ తోనే ఉన్నారు ఫ్యాన్స్. వచ్చే ఏడాది రిలీజ్‌కి ముస్తాబవుతోంది హరిహరవీరమల్లు.

ఈ సినిమా కోసం మేకర్స్ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అభిమానులు ఈ సినిమాతో పాటు ఓజీ కోసం కూడా అంతే ఇష్టంగా ఎదురుచూస్తున్నారు. దీంతో హరిహరవీరమల్లు వర్సెస్ ఓజీ అన్నట్టు తయారైంది సిట్చువేషన్.

హరిహరవీరమల్లు నుంచి ఓ అప్‌డేట్ రాగానే, అందరూ ఓజీ మేకర్స్ వైపు చూస్తున్నారు. అటు నుంచి చప్పుడు కాగానే, ఇటు చూడటం అలవాటుగా మారింది. ఒకే సీజన్‌లో వచ్చే సినిమాల మధ్య పోటీ ఉండటం మామూలేగానీ,

ఇప్పుడు సడన్‌గా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది ఆ థర్డ్ ప్రాజెక్ట్.. ఇంతకీ మనం ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నామో.. అర్థమైందిగా.! యస్.. ఇప్పుడు ట్రెండ్ అవుతోంది ఉస్తాద్ భగత్‌సింగ్.




