మచిలీపట్నంలో 17 ఏళ్ల బాలికపై పూజారి లైంగిక దాడి చేసి గర్భవతిని చేసిన దారుణ ఘటన వెలుగు చూసింది. ఎదురింటి పూజారి మాయమాటలతో బాలికను పలుమార్లు లోబరుచుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు అనుమానంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా విషయం బయటపడింది. ప్రస్తుతం పూజారి పోలీసుల అదుపులో ఉన్నాడు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.