AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas : ప్రభాస్ మరదలిగా, ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. క్రేజ్ చూస్తే మెంటలే..

ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. స్టార్ హీరోహీరోయిన్లకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం ఓ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? సినీరంగంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న ముద్దుగుమ్మ.

Prabhas : ప్రభాస్ మరదలిగా, ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. క్రేజ్ చూస్తే మెంటలే..
Anushka Shetty
Rajitha Chanti
|

Updated on: Mar 20, 2026 | 12:43 PM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరు. కానీ బాహుబలి సినిమా తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన స్టార్ డమ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం వరల్డ్ వైడ్ యంగ్ రెబల్ స్టార్ గా దూసుకుపోతున్నారు. చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపిస్తున్నారు. మరోవైపు ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే రాజా సాబ్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన డార్లింగ్..ఇప్పుడు స్పిరిట్, ఫౌజీ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. ప్రభాస్ కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో నటించారు. అందులో ఒక హీరోయిన్ మాత్రం ప్రభాస్ మరదలిగా, భార్యగా, తల్లిగా కనిపించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆమెకు 15.. అతడికి 24.. పదేళ్లుగా సీక్రెట్ లవ్.. కట్ చేస్తే.. భార్యభర్తలుగా ఒక్కటైన హీరోహీరోయిన్..

ప్రభాస్ మరదలుగా, ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా.. ఇలా అన్ని పాత్రలలో నటించిన ఏకైక హీరోయిన్ అనుష్క శెట్టి. టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్. సాధారణ యోగా టీచర్.. అనుహ్యంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దాలపాటు ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా దూసుకుపోయింది. సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. అరుంధతి మూవీతోబ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ ప్రశంసలు అందుకుంది. ప్రభాస్, అనుష్క కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఎక్కువమంది చదివినవి : Appa Rao: ఆ సినిమా సమయంలో చేసిన పని.. నా ఫేస్ మొత్తం బ్లాక్ అయ్యింది.. జబర్దస్త్ అప్పారావు..

వీరిద్దరి జోడికి ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది. వీరిద్దరు కలిసి బిల్లా, మిర్చి, బాహుబలి 1, 2 వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఈ చిత్రాల తర్వాత అనుష్క సినిమాలు తగ్గించింది. ఎప్పుడో ఒక మూవీ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇదిలా ఉంటే.. నాలుగు పదుల వయసులోనూ పెళ్లికి దూరంగా ఒంటరిగా ఉంటుంది. గత వారం రోజులుగా ఈ అమ్మడు పెళ్లి వార్తలు నెట్టింట హల్చల్ చేస్తుండగా.. అనుష్క టీమ్ ఖండించింది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లును సుడిగాలి సుధీర్‏కు అమ్మేశా.. టాలీవుడ్ నటుడు..

ఎక్కువమంది చదివినవి : Jabardasth Naresh: నెలకు 13 ఈవెంట్స్ చేస్తా.. ఒక్కో ఈవెంట్‏కు ఎంత తీసుకుంటానంటే.. జబర్దస్త్ నరేష్..

Follow Us