AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బొమ్మతో ఆడుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న చిన్నారి.. రెండు నెలల తర్వాత బయటపడిన నిజం!

సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్‌గా మారింది. ప్రతి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది. ఐదేళ్ల చిన్నారికి రెండు నెలలుగా దగ్గు వస్తుండగా, వాతావరణ మార్పు వల్లేనని తల్లిదండ్రులు సాధారణంగా భావించారు. కానీ దగ్గు తీవ్రమై, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి, రాత్రిళ్లు నిద్రలేని పరిస్థితి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎక్స్-రేలో స్పష్టత లేకపోయినా, బ్రాంకోస్కోపీ పరీక్ష చేయగా రిపోర్ట్‌లో షాకింగ్‌ విషయం బయటపడింది. అది చూసిన వైద్యులు, చిన్నారి తల్లిదండ్రులు నివ్వేర పోయారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

బొమ్మతో ఆడుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న చిన్నారి.. రెండు నెలల తర్వాత బయటపడిన నిజం!
Persistent Cough In Children
Jyothi Gadda
|

Updated on: Nov 29, 2026 | 10:20 AM

Share

ఆగ్రాకు చెందిన ఐదేళ్ల చిన్నారికి గత రెండు నెలలుగా దగ్గు సమస్య వేధిస్తోంది. సీజన్ మారడం వల్లే ఇలా వస్తోందని తల్లిదండ్రులు తేలికగా తీసుకున్నారు. అయితే దగ్గుతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడం, రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోలేకపోవడం వంటి లక్షణాలు కనిపించాయి. పరిస్థితి మెరుగుపడకపోవడంతో తల్లిదండ్రులు ఆ చిన్నారిని ఎస్ఎన్ మెడికల్ కాలేజీలోని ఈఎన్టీ విభాగానికి తీసుకెళ్లారు.

వైద్య పరీక్షల్లో బయటపడ్డ అసలు విషయం:

వైద్యులు తొలుత ఎక్స్-రే తీసినప్పటికీ అందులో స్పష్టమైన కారణం కనిపించలేదు. అయినప్పటికీ చిన్నారి ఇబ్బందిని గమనించి, శ్వాసనాళంలో ఏదైనా వస్తువు ఇరుక్కుందేమోననే అనుమానంతో బ్రాంకోస్కోపీ పరీక్ష చేయాలని నిర్ణయించారు. ఆ పరీక్షలో ఊపిరితిత్తులకు గాలి చేరే కీలక భాగంలో శ్వాసనాళంలో ఒక బొమ్మలోని చిన్న విజిల్ ఇరుక్కున్నట్లు గుర్తించారు. దాని కారణంగా ఒకవైపు గాలి వెళుతుండగా, మరోవైపు మార్గానికి అడ్డంకి ఏర్పడింది. దీంతో చిన్నారికి నిరంతరం దగ్గు, శ్వాస సమస్యలు తలెత్తాయి.

విజిల్ తొలగింపుతో ఉపశమనం:

నివేదిక ఆధారంగా వైద్యుల బృందం ఎంతో జాగ్రత్తగా ఆ విజిల్‌ను శ్వాసనాళం నుండి బయటకు తీసింది. అనంతరం చిన్నారిని కొంతకాలం వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆరోగ్యం కుదుటపడటంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు.

ఇవి కూడా చదవండి

తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

చిన్న పిల్లలు ఆడుకునేటప్పుడు వస్తువులను నోట్లో వేసుకునే అలవాటు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. బొమ్మల చిన్న భాగాలు, వేరుశెనగ వంటివి శ్వాసనాళంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇటువంటి సందర్భాల్లో నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం కూడా జరగవచ్చు.

మూడేళ్ల లోపు పిల్లలకు నోట్లో పట్టే చిన్న బొమ్మలు లేదా వస్తువులను ఇవ్వకూడదు.

వేరుశెనగ వంటివి తినిపించేటప్పుడు పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి.

3 నుండి 5 ఏళ్ల పిల్లలు తింటూ మాట్లాడినప్పుడు ఆహారం లేదా చిన్న వస్తువులు శ్వాసనాళంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది.

పిల్లలకు చాలా రోజుల పాటు దగ్గు కొనసాగినా లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us