అనుష్క శెట్టి తన పెళ్లి, వయసుపై వస్తున్న రూమర్ల పట్ల స్పందించారు. అవాస్తవ ప్రచారాలను ఖండించిన ఆమె, 44 ఏళ్ల వయసును హైలైట్ చేయడంపై ప్రశ్నించారు. హీరోలకు లేని ఈ వయసు ప్రస్తావన హీరోయిన్లకు మాత్రమే ఎందుకని నిలదీశారు. బాధ్యతాయుతంగా వార్తలు ప్రచురించాలని, నిజాలను మాత్రమే సర్క్యులేట్ చేయాలని కోరారు. హీరోలకు సమానంగా హీరోయిన్లను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.