Bigg Boss 8 Telugu: ప్రేరణను టార్గెట్ చేసిన ఆ ముగ్గురు.. నామినేషన్స్‌లో ఉన్నది వీరే.. హరితేజ లక్కు అదిరింది..
బిగ్‌బాస్ హౌస్ లో మణికంఠ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా గౌతమ్ అయితే ఇంత ఆడినా లీస్ట్ లో ఉన్నానా అంటూ తలపట్టుకున్నాడు. దీంతో దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పింది యష్మీ. ఇక ఎప్పటిలాగే నామినేషన్స్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు బిగ్‌బాస్.
బిగ్‌బాస్ సీజన్ 8లో ఏడోవారం మణికంఠ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈవారం నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. ప్రతి ఇంటి సభ్యుడు ఇంట్లో ఉండటానికి అర్హతలేని ఇద్దరి సభ్యుల దిష్టి బొమ్మల మీద కుండలు పెట్టి కారణాలు చెప్పి వాటిని పగలగొట్టాల్సి ఉంటుంది. మెగా చీఫ్ కారణంగా గౌతమ్‌ను ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు. గౌతమ్ ఈ ఇంట్లో ఒక నామినేషన్ షీల్డ్ ఉంది. ఆ నామినేషన్ షీల్డ్ ను నచ్చినవారికి ఇవ్వండి. అది ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆ సభ్యుడిని ఈవారం నామినేట్ చేసి ప్రతిసారి రూ.50 వేల విన్నర్స్ ప్రైజ్ మనీ నుంచి డిడక్ట్ అవుతాయని చెప్పాడు బిగ్‌బాస్. దీంతో ఆ షీల్డ్ హరితేజకు ఇవ్వడంతో నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యింది హరితేజ.
లాస్ట్ వీక్ తేజకు బదలుగా పృథ్వీని నామినేట్ చేయడం నచ్చలేదని పరొక్షంగా చెబుతూనే ప్రేరణను నామినేట్ చేసింది విష్ణు. గేమ్ స్లో అయ్యిందని.. లైటర్ కోసం పాయింట్ ఇవ్వడం నచ్చలేదంటూ నిఖిల్ ను నామినేట్ చేసింది. అలాగైతే నువ్వే ముందు బ్రేక్ ఫాస్ట్ చేసి పాయింట్ ఇచ్చేశావ్ అంటూ నిఖిల్ పాయింట్ రెయిజ్ చేశాడు. ఆ తర్వాత ఆటలో ఫిజికల్ కావడం నచ్చలేదంటూ నిఖిల్ ను నామినేట్ చేసింది రోహిణి. సెల్ఫిష్ట్ గా ఆలోచిస్తావ్.. గేమ్ లో అగ్రెసివ్ అవుతున్నావంటూ పృథ్వీని నామినేట్ చేసింది. దీంతో పృథ్వీ, రోహిణి మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఇక ఇప్పటికే ప్రేరణను టార్గెట్ చేసిన పృథ్వీ ఈసారి రివేంజ్ నామినేషన్ చేశాడు. టాస్కులో వీక్, ఆటలో జీరో, రన్నింగ్ కూడా రావాలని.. అది అంత ఈజీ కాదు అంటూ రోహిణిని పై నుంచి కింద వరకు చూశాడు పృథ్వీ. దీంతో తన చూపు నచ్చలేదని.. బాడీ షేమింగ్ చేస్తున్నాడంటూ అంటూ గొడవ చేసింది రోహిణి.
ఇది చదవండి : OTT Movie: అంతుచిక్కని రహస్యాలు.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. మైథిలాజికల్ థ్రిల్లర్ మూవీ ఎక్కడ చూడొచ్చంటే..
బ్యాటరీ టాస్కులో సెల్ఫిష్ గా ఆడారంటూ మెహబూబ్, నిఖిల్ ను నామినేట్ చేసింది నయని పావని. కొంపలు మునిగాక రావడం మానేయాలంటూ ప్రేరణను నామినేట్ చేసింది హరితేజ. సెల్ఫిష్ గా గేమ్ ఆడావంటూ మెహబూబ్ ను నామినేట్ చేసింది . నన్ను ఇమ్మెచ్యూర్ అనడం నచ్చలేదని.. వేరేవాళ్ల పనుల్లో దూరొత్తు అంటూ ప్రేరణను నామినేట్ చేశాడు నబీల్. ప్రైజ్ మనీలో నుంచి రూ.50 వేలు పోయినా పర్లేదని హరితేజను నామినేట్ చేశాడు. మొత్తానికి ఈ వారం నామినేషన్లలో పృథ్వీ వర్సెస్ రోహిణి.. పృథ్వీ వర్సెస్ ప్రేరణ మధ్య పెద్ద గొడవే జరిగింది.
ఇది చదవండి : Tollywood: వణుకుపుట్టించే థ్రిల్లర్ మూవీ.. ఈ సినిమాను అస్సలు మిస్సవద్దు..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.