Brahmamudi, October 21st Episode: పిల్ల కాకి గట్టి దెబ్బ ఇచ్చిన అపర్ణ.. సిఈవోగా కళావతి!
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. సరే ఇక్కడి నుంచి వెళ్లిపోతామని ఇందిరా దేవి, అపర్ణలు అంటే.. సరే వెళ్లమని కావ్య అంటుంది. దీంతో కనకం.. కావ్యని తిడుతుంది. నేనేం వెళ్లమని అనలేదు.. వాళ్లే వెళ్లిపోతామని అన్నారని కావ్య అంటుంది. నువ్వు వెళ్లిపొమ్మంటే వెళ్లిపోతామా ఏంటి? ఈ సమస్య మాతోనే మొదలైంది కాబట్టి.. పరిష్కారం చూపించడానికి వచ్చామని అంటారు. ఓహో రెండో నాటకానికి రంగం సిద్ధం చేశారా అని కావ్య అంటుంది. ఇవన్నీ కాదు.. నీ కోసమే అద్భుతమైన పరిష్కారం తీసుకొచ్చామని అపర్ణ అంటే..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. సరే ఇక్కడి నుంచి వెళ్లిపోతామని ఇందిరా దేవి, అపర్ణలు అంటే.. సరే వెళ్లమని కావ్య అంటుంది. దీంతో కనకం.. కావ్యని తిడుతుంది. నేనేం వెళ్లమని అనలేదు.. వాళ్లే వెళ్లిపోతామని అన్నారని కావ్య అంటుంది. నువ్వు వెళ్లిపొమ్మంటే వెళ్లిపోతామా ఏంటి? ఈ సమస్య మాతోనే మొదలైంది కాబట్టి.. పరిష్కారం చూపించడానికి వచ్చామని అంటారు. ఓహో రెండో నాటకానికి రంగం సిద్ధం చేశారా అని కావ్య అంటుంది. ఇవన్నీ కాదు.. నీ కోసమే అద్భుతమైన పరిష్కారం తీసుకొచ్చామని అపర్ణ అంటే.. ముందు అదేంటో చెప్పండి.. అది అద్భుతమో కాదో చెప్తానని కావ్య అంటుంది. ఎంత లోకువ అయిపోయాం నీకు.. అని అపర్ణ అంటుంది. క్షమించండి అత్తయ్యా.. మీరు నాకు లోకు అయిపోవడం ఏంటి? మీరు నా వెనుక నుంచి ఏం చేసినా.. ఆయనకు ముందు కనిపించేది నేను. మాట పడేది నేను.. ఆ మాటలు పడ్డాను కాబట్టే.. నా బతుకు నేను బతకాలని అనుకుంటున్నానని కావ్య అంటుంది. ఇక అంతేనా.. పుట్టింట్లో ఉండి ఏం చేస్తావని పెద్దావిడ అడుగుతుంది. బొమ్మలకు రంగు వేస్తానని కావ్య అంటుంది.
నా వల్ల కాదు అత్తయ్యా..
నువ్వు మళ్లీ కంపెనీలో జాయిన్ కావాలి. కాబట్టి చేయని తప్పుకు తలవంచి.. ఇక్కడ ఉంటానంటే లాభం లేదు. నీ టాలెంట్‌కి మంచి గుర్తింపు రావాలి. వాడి తప్పు వాడు తెలుసుకునేలా చేయాలని అపర్ణ అంటుంది. ఇది అంత సులభం కాదని కావ్య అంటే.. ఆ సులభాన్ని నువ్వు రుజువు చేస్తావనే అనుకుంటున్నాం. నీ తప్పు లేదని తెలిసేలా చేయాలని పెద్దావిడ అంటుంది. అదే నువ్వు నేరుగా వెళ్లి మన కంపెనీలో పని చేస్తే.. ఈ పుకార్లు అన్నీ తప్పని ఈ ప్రపంచానికి తెలుస్తుంది. నా వల్ల దుగ్గిరాల ఫ్యామిలీకి పరువు పోయింది. అది నిజమే.. కానీ అది అనామిక వేసిన ఉచ్చు అని చెప్పినా ఆయన వినిపించుకోవడం లేదు. ఇప్పుడు మళ్లీ వెళ్లి ఆయన ముందే పని చేస్తే.. ఏ చిన్న తప్పు దొరికినా నన్ను ఆడుకుంటారు. దిన దిన గండం.. నూరేళ్ల ఆయుష్షులా ఉంటుంది. మీరు నన్ను బలవంతంగా ఆఫీసులో పెట్టినా.. ఎప్పుడెప్పుడు నన్ను గెంటేద్దామని చూస్తారో తెలీదు. ఒక వేళ అవకాశం ఇవ్వకపోయినా.. ఆయనే అవకాశాలను కల్పించుకుంటారు. నా వల్ల కాదు అత్తయ్యా. మీరే ఆలోచించమని కావ్య అంటుంది.
స్వరాజ్ కంపెనీకి సిఈవోగా కావ్య..
దీంతో అపర్ణ, ఇందిరా దేవి, కనకంలు కలిసి ఓ నిర్ణయం తీసుకుంటారు. నువ్వు వాడి కింద పని చేస్తేనే కదా.. సమస్య. అదే నువ్వు కంపెనీకి సిఈవో అయితే అని అపర్ణ అంటే.. కనకం ఓవరాక్షన్ చేస్తుంది. అమ్మా నీకు తెలిసే కదా ఐడియా తెలుసు కదా.. మళ్లీ ఓవర్ ఎందుకు చేస్తున్నావ్?.. ఇది చాలా మంచి ఐడియా అని మీరు అనుకుంటున్నారు? కానీ ఆయన మీద పగ సాధిస్తున్నానని మరింత ద్వేషం పెంచుకుంటారు. ఇది కూడా బెడిసి కొడుతుందని కావ్య అంటుంది. మీరిద్దరూ కలిసి పని చేస్తే.. కంపెనీని నష్టాల నుంచి బయట పడేయవచ్చని అపర్ణ అంటాడు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఆయన మనసులో నేను లేను అన్నారు కదా మరి దాని మాట ఏంటని కావ్య అడుగుతుంది. ఏంటే నువ్వు పెద్ద వాళ్లు దిగొచ్చి నీ కాపురం గురించి ఇంత ఆరట పడుతుంటే.. కోడి గుడ్డుకి ఈకలు పీకుతావేంటి? ఇంకేం మాట్లాడకు కావ్య వస్తుందని కనకం సీరియస్ అవుతుంది.
మీ కంపెనీలో కావ్య పని చేయడానికి కుదరదు..
అప్పుడే అనామిక వచ్చి చప్పట్లు కొడుతుంది. ఏంటి కంపెనీకి సిఈవోని చేసేస్తున్నారంటే.. మీ పెద్ద మనుసుకు జోహార్లు. కానీ ఎవరి ఎంప్లాయిని ఎవరు రిక్రూట్ చేసుకుంటున్నారు? కావ్య మా ఆఫీసులో డిజైనర్‌గా జాయిన్ అయ్యింది కదా.. ఇప్పుడు తను ఎక్కడ జాయిన్ అవ్వాలన్నా నా పర్మిషన్ కావాలని అంటుంది. నా మనవరాలు.. నీ కింద పని చేయడం ఏంటి వెళ్లు అని పెద్దావిడ అంటుంది. కావ్య నా దగ్గర పని చేయకుండా.. మీ ఆఫీస్‌లో జాయిన్ అయితే.. నేను కోర్టులో కేసు వేస్తానని అంటుంది. కారణం ఏంటి? అని అపర్ణ అడిగితే.. ఆ అగ్రిమెంట్ పేపర్స్ తీసుకుని చదివిన అపర్ణ.. పిల్ల కాకి.. ఇది చూపించా నా కోడల్ని బెదిరిస్తున్నావ్? ఇప్పుడే వస్తాను ఉండు అని వెళ్లి తీసుకొచ్చి రూ.50 లక్షల చెక్ ఇస్తుంది. ఇది ఎందుకు అని అనామిక అంటే.. ఆ అగ్రిమెంట్‌లో ఎగ్జిట్ క్లాజ్ కూడా ఉంది. అనుకోకుండా ఉద్యోగం మానేయాల్సి వస్తే.. రూ.25 లక్షలు కడితే చాలని ఈ అగ్రిమెంట్‌లో రాసి ఉంది. ఇదిగో అందుకు డబుల్ ఇస్తున్నానని అపర్ణ చెబుతుంది. దీంతో అనామిక మళ్లీ పేపర్స్ చదివి ఫీల్ అవుతుంది. ఇదిగో పిల్ల కాకి ఎలా ఉంది దెబ్బ అంటూ ఆటపట్టిస్తుంది కనకం.
పిల్ల కాకికి షాక్ ఇచ్చిన అపర్ణ..
నీకు ఇంకో షాక్ ఇస్తున్నా.. మీ ఇంటికి కోర్టు నోటీసు వస్తుంది. నీ పెళ్లి జరిగిన రోజు నా కొడుకు రెండు కోట్లు ఇచ్చాడు కదా.. అది వెంటనే తిరిగి ఇవ్వకపోతే మీ ముగ్గురిని నేను జైలుకు పంపిస్తాను. గెట్ ఔట్.. అని అపర్ణ అంటుంది. దీంతో అనామిక వెళ్లిపోతుంది. చూశావు కదా.. నీ తప్పు లేకపోయినా రాజ్ ముందు నిన్ను దోషిని చేసింది. ఇప్పుడు స్వేచ్ఛగా బయట పడ్డావు. వాడి మాటలు పట్టించుకోకుండా కంపెనీలో పని చేయమని అంటుంది. సరే అని ఒప్పుకుంటుంది కావ్య.
పాట అందుకున్న కళ్యాణ్.. చేతిలో డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్..
మరో వైపు.. కళ్యాణ్ ఆటో దగ్గర నిలబడి ఉంటాడు. అప్పుడే అప్పూ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఫోన్ చేసి.. డబ్బు త్వరగా పే చేయాలని చెప్తారు. అదే పని మీద ఉన్నాను ఇచ్చేస్తానని కళ్యాణ్ అంటాడు. అప్పుడే ఓ సినిమా ప్రోడ్యూసర్, మ్యూజిక్ లిరిక్ రైటర్ కారు ఆగిపోతుంది. వీళ్లిద్దరూ అనుకోకుండా కళ్యాణ్ ఆటో ఎక్కుతారు. సర్ ఆయన ఫేమస్ లిరిక్ రైటర్ లక్ష్మీ కాంత్ కదా.. ఆయన ఆటోగ్రఫీ కావాలని కళ్యాణ్ అడుగుతాడు. ఇక ఆటో ఎక్కిన లిరిక్ రైటర్, ప్రొడ్యూసర్ మాట్లాడుకుంటూ ఉంటారు. సర్ పాట ఇంకా ఆలస్యం అయిపోయింది. ఇప్పుడైనా త్వరగా పూర్తి చేయమని ప్రొడ్యూసర్ అంటాడు. అక్షరాలు రావాలంటే కాస్త సమయం పడుతుందని లిరిక్ రైటర్ అంటాడు. సరే ఇంతకీ ఆ పాటకి డైరెక్టర్ గారు చెప్పిన సిచ్యువేషన్ ఏంటని అడుగుతాడు. మొదటి సారి హీరో.. హీరోయిన్‌ని సముద్రం దగ్గర చూసి పడిపోతాడు. ఆ అమ్మాయి అందాన్ని పొగుడుతూ పాట కావాలని అంటాడు ప్రొడ్యూసర్. సరే రెండు రోజుల సమయం కావాలని లిరిక్ రైటర్ అడుగుతాడు. ఇక వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా.. కళ్యాణ్ ఓ మంచి పాట అందుకుంటాడు. అది విని ప్రొడ్యూషర్ షాక్ అవుతాడు. అలా పాట పాడుతూ.. వాళ్లను ఓ చోట దించేస్తాడు. చప్పట్లు కొడుతూ.. సూపర్.. నాకు మంచి పాట దొరికింది.. ఇదిగో డబ్బులు అని చేతిలో పెట్టి వెళ్తాడు ప్రొడ్యూసర్. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో కొత్త బాస్ వచ్చారని.. మీరు ఆ గదిలో కూర్చోవాలని శ్రుతి చెబుతుంది. ఎవరా అనుకుంటూ లోపలికి వెళ్లి షాక్ అవుతాడు రాజ్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..