AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 Telugu: సెల్ఫ్ ఎలిమినేషన్ అయినా బాగానే సంపాదించిన నాగ మణికంఠ.. 7 వారాలకు ఎన్ని లక్షలంటే?

తెలుగు బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. ఈ కొత్త సీజన్ ప్రారంభమై ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా ఏడు వారాలు పూర్తయ్యాయి. ఆదివారం (అక్టోబర్ 20) నాటి ఎపిసోడ్ లో మణికంఠ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు.

Bigg Boss 8 Telugu: సెల్ఫ్ ఎలిమినేషన్ అయినా బాగానే సంపాదించిన నాగ మణికంఠ.. 7 వారాలకు ఎన్ని లక్షలంటే?
Naga Manikanta
Basha Shek
|

Updated on: Oct 21, 2024 | 11:48 AM

Share

బిగ్‌బాస్‌ షో నుంచి నాగ మణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. అది కూడా సెల్ఫ్ గోల్ వేసుకుని మరీ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. షో ప్రారంభంలో తన భార్య, బిడ్డల కోసం బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చానంటూ, వారి కోసమైనా బిగ్ బాస్ టైటిల్ గెలుస్తానంటూ ప్రగల్భాల పలికాడు మణికంఠ. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో చెబుతూ తెగ ఎమోషనల్ అయ్యాడు. చిటికీ మాటకీ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ స్టార్, సింపతీ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇది హౌస్ లోని కంటెస్టెంట్స్ తో పాటు ఆడియెన్స్ కు కూడా చిర్రాకు తెప్పించింది. ఇక ఎవరైనా తనను నామినేట్ చేస్తే చాలు.. ఆ వారమంతా తెగ టెన్షన్‌ పడిపోయేవాడు. తను హౌస్‌లోనే ఉండాలని తెగ బరతపించాడు. బిగ్ బాస్ టైటిల్ గెలిచే తన భార్య, బిడ్డల దగ్గరకు వెళతానని శపథాలు చేశాడు. కానీ గత వారం సీన్ మొత్తం మారిపోయింది. ఏమైందో ఏమో ఇక హౌస్ లో ఉండలేనన్నాడు మణికంఠ. ఇంటికి వెళ్లిపోతానంటూ తెగ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆరోగ్యం బాగోలేదు.. తన మైండ్ పని చేయట్లేదు.. బాడీ సహకరించట్లేదు.. బయటకు పంపించండి మహా ప్రభో అంటూ బిగ్ బాస్ ను వేడుకున్నాడు.

నాగ మణికంఠ పరిస్థితిని అర్థం చేసుకుని డాక్టర్‌ దగ్గరకు కూడా పంపించగా వాళ్లు బాగానే ఉందని సర్టిఫికెట్‌ ఇచ్చేశారు. అయినా సరే హౌస్‌లో సర్దుకోలేకపోయాడు మణికంఠ. అతడు కోరుకున్నట్లుగానే నాగార్జున బయటకు పంపించేశారు.ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌజ్‌లో ఏడు వారాలు ఉన్న మణికంఠ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. నాగ మణికంఠ రోజుకు 17 వేల 142 రూపాయలు చొప్పున వారానికి రూ. 1,20,000 (లక్షా 20 వేల రూపాయలు) పారితోషికం తీసుకునేవాడని సమాచారం. ఈ లెక్కన ఏడు వారాల్లో సుమారు రూ.8.40 లక్షలు వెనకేసినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

ఆరోగ్యం బాగోలేదంటూ సెల్ఫ్ ఎలిమినేషన్..

బిగ్ బాస్ బజ్ లో నాగ మణికంఠ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!