Jani Master: ‘జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డు వస్తుంది.. దీనిపై మేం పోరాటం చేస్తాం’.: ప్రముఖ డ్యాన్స్ మాస్టర్

2022 సంవత్సరానికి గాను కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తిరుచిత్రంబలం (తెలుగులో తిరు) సినిమాకు గాను జానీ మాస్టర్ ను బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా ఎంపికయ్యారు. అయితే అనూహ్యంగా అతనిపై అత్యాచారంతో పాటు పోక్సో కేసులు నమోదవ్వడంతో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును నిలిపివేశారు.

Jani Master: 'జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డు వస్తుంది.. దీనిపై మేం పోరాటం చేస్తాం'.: ప్రముఖ డ్యాన్స్ మాస్టర్
Jani Master
Follow us
Basha Shek

|

Updated on: Oct 20, 2024 | 8:59 PM

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటోన్న జానీ మాస్టర్ ప్రస్తుతం జైల్లో నే రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. అతని బెయిల్ పిటిషన్ ను కూడా ఇటీవల రంగారెడ్డి ప్రత్యేక పోక్సో కోర్టు కొట్టివేసింది. దీంతో జానీ మాస్టర్ మరికొన్ని రోజులు జైలులో ఉండేలా తప్పడం లేదు. అయితే ఇప్పుడు జానీ వ్యవహారం టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుపై ఒక్కొక్కరు ఒకలా స్పందిస్తున్నారు. ఇప్పటివరకు చాలా మంది సినీ ప్రముకులు బాధితురాలికి మద్దతుగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. అయితే ఇప్పుడు జానీకి అనుకూలంగా కూడా కొందరు గళం విప్పుతున్నారు. మరీ ముఖ్యంగా జానీ మాస్టర్ కు రావాల్సిన జాతీయ అవార్డు ను సడెన్ గా నిలిపివేయడంపై ప్రముఖ కొరియోగ్రాఫర్లు మండి పడుతున్నారు. జానీ మాస్టర్ కు అన్యాయం జరిగిందంటూ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడిస్తున్నారు. జానీ మాస్టర్ కష్టపడి ఈ స్థాయికి వచ్చారని, అలాంటి వ్యక్తి జీవితాన్ని నాశనం చేశారని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం బిగ్ బాస్ ఫేమ్ ఆట సందీప్, అతని భార్య జ్యోతి జానీకి బహిరంగంగానే మద్దతు తెలుపుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. అలాగే ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు బండి సరోజ్ కుమార్ కూడా జానీకి సపోర్టుగా ట్వీట్ చేశారు. ఇక రెండు రోజుల క్రితం స్టార్ కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ జానీ మాస్టర్ కు అనూకూలంగా మాట్లాడింది. తాజాగా మరో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాధా మాస్టర్ కూడా జానీకి అనుకూలంగా సంచలన కామెంట్స్ చేసింది.

‘ నేషనల్ అవార్డ్ అందుకోవడానికి జానీ మాస్టర్ అన్ని విధాలా అర్హుడు. ఆయన కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. కాబట్టి తప్పకుండా ఈ అవార్డు మాస్టర్ కు వస్తుందని మేం నమ్ముతున్నాం. బాధితురాలి వెనక ఉండి ఎవరో జానీ మాస్టర్ పై కుట్ర చేస్తున్నారు. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి. ఆయన కోసం మేమంతా పోరాటం చేస్తాం’ అని రాధా మాస్టర్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. వీటిపై నెటిజన్లు కూడా భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి
Radha Master

Radha Master

ఇటీవల జానీ మాస్టర్ భార్య షేర్ చేసిన పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!