Renu Desai: శాస్త్రోక్తంగా చండీ హోమం చేసిన రేణూ దేశాయ్.. పాల్గొన్న అకీరా నందన్.. వీడియో చూడండి

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న రేణూ దేశాయ్ సామాజిక సేవా కార్యక్రమాలతో బిజి బిజీగా ఉంటోంది. పేద పిల్లలకు, జంతువులకు తనకు తోచినంత సహాయం చేయడంతో పాటు తన అభిమానులు, ఫాలోవర్లను కూడా సోషల్ మీడియా వేదికగా విరాళాలు అడుగుతూ ఉంటుంది.

Renu Desai: శాస్త్రోక్తంగా చండీ హోమం చేసిన రేణూ దేశాయ్.. పాల్గొన్న అకీరా నందన్.. వీడియో చూడండి
Actress Renu Desai
Follow us
Basha Shek

|

Updated on: Oct 19, 2024 | 7:25 PM

ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ తన నివాసంలో గణ పతి చండీ హోమం నిర్వహించింది. శరద్ పూర్ణిమ సందర్భంగా నిర్వహించిన ఈ పూజా కార్యక్రమాల్లో ఆమె తనయుడు అకీరా నందన్ కూడా పాల్గొన్నాడు. హోమానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన రేణు దేశాయ్ మన సంస్కృతి గొప్పతనాన్ని మన పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత మనదేనంటూ సూచించింది. ‘శరద్ పూర్ణిమ సందర్భంగా మా ఇంట్లో గణపతి, చండీహోమం అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించాం. మన సాంప్రదాయలు, ఆచారాలను పిల్లలకు నేర్పించాలి. పూజ సమయంలో ఎలాంటి ఆర్భాటం లేకుండా, ప్రశాంతంగా భక్తి మీదనే దృష్టి పెట్టాలి’ అని ఈ పోస్టులో రాసుకొచ్చింది రేణు దేశాయ్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కాగా రేణు దేశాయ్ కు దేవుడిపై భక్తి ఎక్కువ. ఈ క్రమంలోనే ఆమె తరచూ పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటుంది. అదే సమయంలో పండగల పేరుతో కొందరు చేస్తోన్న హంగులు, ఆర్భాట కార్యక్రమాలను తప్పుపడుతూ ఉంటుంది. ఇటీవల వినాయక చవితి సందర్భంగా రేణు దేశాయ్ షేర్ చేసిన ఒక పోస్ట సంచలనంగా మారిన సంగతి తెలిసిందే

ప్రస్తుతం సింగిల్ మదర్ గానే లైఫ్ ను లీడ్ చేస్తోన్న రేణూ దేశాయ్ తన పిల్లలు ఆద్య, అఖిరా నందన్ ల బాధ్యతలను చూసుకుంటుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె ‘టైగర్ నాగేశ్వరావు’ మూవీతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇందులో ఆమె పోషించిన హేమలతా లవణం పాత్రకు మంచి ప్రశంసలు వచ్చాయి. దీంతో రేణూ మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. ఈ సినిమా రిలీజై కూడా ఏడాది గడిచింది. అయితే మళ్లీ కెమెరా ముందుకు వెళ్లనున్నట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిందీ అందాల తార. అయితే అది సినిమానా? వెబ్ సిరీస్ నా? అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

ఇవి కూడా చదవండి

చండీ హోమంలో రేణూ దేశాయ్, అకీరా నందన్.. వీడియో

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

షూట్ లో రేణూ దేశాయ్..

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!