- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss Telugu Fame Shobha Shetty Stuns Netizens In Mother Saree
Shobha Shetty: అమ్మ చీర కట్టుకుని తెగ మురిసిపోయిన బిగ్ బాస్ బ్యూటీ.. శోభా శెట్టి లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
శోభా శెట్టి గురించి తెలుగు ఆడియెన్స్ కు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం ఆమెది. కార్తీక దీపం సీరియల్ తో బాగా పాపులర్ అయిన ఆమె బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 తో ఇక్కడి ఆడియెన్స్ కు మరింత చేరువైంది
Updated on: Oct 18, 2024 | 9:32 PM

బిగ్ బాస్ రియాలిటీ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కన్నడ ముద్దుగుమ్మ శోభా శెట్టి కూడా ఒకరు. ఏడో సీజన్ లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టిన శోభ తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ప్రేక్షకులను కట్టి పడేసింది.

బిగ్ బాస్ కంటే ముందు టీవీ నటిగా అందరికీ పరిచయమైన నటి శోభాశెట్టి. కార్తీక దీపం విలన్ మోనిత పాత్రలో అదరగొట్టేసింది.

ఇదే క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన ఈ కన్నడ బ్యూటీ తన దైన ఆటతీరును ప్రదర్శించింది. ముఖ్యంగా శివాజీ గ్యాంగ్ తో ఢీ అంటే ఢీ అంటూ తలపడింది.

అన్నట్లు త్వరలోనే తన ప్రియుడు యశ్వంత్ రెడ్డితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనుంది శోభా శెట్టి. ఈ ఏడాది జనవరిలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది.

ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉండే శోభా శెట్టి 'అమ్మచీర' అంటూ నీలిరంగు చీరలో ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇవి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.




