- Telugu News Photo Gallery Cinema photos Will allu arjun pushpa 2 get hug collection by the end of the year 2024
Pushpa 2: భారమంతా బన్నీ పైనే.. భారీగా ప్లాన్ చేస్తున్న అల్లు అర్జున్
లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కే వేరప్పా అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ అందరికి గుర్తుండే ఉంటది.. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ అలాంటి కిక్ కోసమే ప్రయత్నిస్తున్నారు.. ఈ ఏడాదిలో ఎన్ని సినిమాలు వచ్చినా ఏడాది చివరన తన సినిమా ద్వారా వచ్చే కిక్ కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు బన్నీ..
Updated on: Oct 18, 2024 | 10:00 PM

ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇది బిగ్గెస్ట్ రిలీజ్ అంటున్నారు మేకర్స్. మరి రిలీజే ఈ రేంజ్‌లో ఉంటే ఇక వసూళ్లే ఇంకే స్థాయిలో ఉంటాయో ఇప్పటి నుంచి లెక్కలేసుకుంటున్నారు బన్నీ ఫ్యాన్స్.

2024లో అదిరిపోయే పాన్ ఇండియన్ హిట్లు తక్కువగానే ఉన్నాయి. సంక్రాంతికి హనుమాన్‌తో మొదలైంది ఈ మ్యాజిక్.. ఈ సినిమా ఏకంగా 350 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత అన్ని భాషల్లో మ్యాజిక్ చేసిన సినిమా కల్కి 2898 ఏడి.

ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ చిత్రం 1100 కోట్లు వసూలు చేసింది. గతేడాది డిసెంబర్‌ను కూడా సలార్‌తో ఘనంగా ముగించారు రెబల్ స్టార్. కల్కి తర్వాత మళ్లీ ఆ స్థాయి మ్యాజిక్ దేవర చేస్తుందిప్పుడు. కాకపోతే కేవలం తెలుగు, హిందీలోనూ ఈ చిత్ర దూకుడు సాగుతుంది.

తమిళ, మలయాళంలో మాత్రం ఊహించిన స్థాయిలో వసూళ్లు రావట్లేదు. దాంతో ఈ భారం బన్నీ తీసుకుంటున్నారు. పుష్ప 2తో 2024ను ఘనంగా ముగించే బాధ్యత తనదే అంటున్నారు ఐకాన్ స్టార్.

డిసెంబర్ 6న విడుదల కానుంది పుష్ప 2. ఈ ఏడాది రానున్న చివరి మోస్ట్ ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ ఇదే. నార్త్‌లోనూ దీనిపై అంచనాలు మామూలుగా లేవు. 2021లోనూ డిసెంబర్‌లోనే వచ్చి రచ్చ చేసారు పుష్ప. మూడేళ్ళ గ్యాప్‌తో మరోసారి ఇదే నెలలో వస్తున్నారు. అన్నీ కుదిర్తే ఇండియన్ సినిమాలో నెక్ట్స్ 1000 కోట్ల ప్రాజెక్ట్ పుష్ప 2నే. మరి ఇన్ని బాధ్యతలు బన్నీ ఎలా మోస్తారో చూడాలిక.




