Rajeev Rayala |
Updated on: Oct 18, 2024 | 10:03 PM
మలయాళంలో అనేక చిత్రాల్లో నటించిన సంయుక్త మీనన్ తెలుగులో పవర్ స్టార్ సినిమాతో పరిచయం అయ్యింది. పవన్ కళ్యాణ్, రానా హీరోగా నటించిన భీమ్లానాయక్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీలో సెకండ్ హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది. ఇందులో సంయుక్త కనిపించింది తక్కువ సమయమే అయినా ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. అందం, అమాయకత్వంతో ఆకట్టుకుంది ఈ అమ్మడు.
తన అందంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో ఈ బ్యూటీకి యూత్ లో మంచి క్రేజ్ వచ్చేసింది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ సరసన విరూపాక్ష, ధనుష్ జోడిగా సార్ చిత్రాలతో మరిన్ని హిట్స్ అందుకుంది.
వరుసగా హిట్స్ అందుకుంటూ గోల్డెన్ బ్యూటీగా పేరు సొంతం చేసుకుంది.అయితే సంయుక్తకు తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రాలేదు. నటనపరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మకు కెరీర్ మాత్రం ఇప్పుడు సైలెంట్ అయ్యింది.
చివరగా కళ్యాణ్ రామ్ సరసన డెవిల్ చిత్రంలో కనిపించింది సంయుక్త. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న స్వయంభూ చిత్రంలో నటిస్తుంది. తాజాగా ఈ అమ్మడు గ్లామర్ గేట్లు ఎత్తేసింది. మొన్నటి వరకు పద్దతిగా పక్కింటి అమ్మాయిగా కనిపించిన ఈ వయ్యారి.
ఇప్పుడు అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది. దాంతో ఈ అమ్మడు కూడా గ్లామరస్ పాత్రలకు ఓకే చెప్పడానికి రెడీ అవుతుందని అంటున్నారు నెటిజన్స్. ఏదేమైనా సంయుక్త అందాలు అదుర్స్ అంటున్నారు కుర్రకారు.