Lawrence Bishnoi: తెరపైకి లారెన్స్ బిష్ణోయ్‌ జీవిత కథ.. వెబ్ సిరీస్‌కు రంగం సిద్ధం.. టైటిల్ ఏంటంటే?

ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గురించి రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. జైల్లో ఉంటూ ఓ స్టార్ నటుడి హత్యకు లారెన్స్ బిష్ణోయ్ వేస్తోన్న స్కెచ్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆర్జీవీ కూడా లారెన్స్ బిష్ణోయ్ పై ఒక సినిమాను తెరకెక్కిస్తాడేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Lawrence Bishnoi: తెరపైకి లారెన్స్ బిష్ణోయ్‌ జీవిత కథ.. వెబ్ సిరీస్‌కు రంగం సిద్ధం.. టైటిల్ ఏంటంటే?
Lawrence Bishnoi
Follow us
Basha Shek

|

Updated on: Oct 18, 2024 | 7:25 PM

లారెన్స్ బిష్ణోయ్ పేరు ప్రస్తుతం మార్మోగిపోతోంది. ఎక్కడ చూసినా ఈ గ్యాంగ్ స్టర్ పేరే వినిపిస్తోంది. కృష్ణ జింకలను వేటాడాడనే కారణంతో సల్మాన్ ఖాన్ పై కోపం పెంచుకున్నాడు బిష్ణోయ్. అప్పటి నుంచే సల్మాన్ ను నీడలా వెంటాడుతున్నాడు. 2014 నుంచి జైలులో ఉన్నప్పటికీ అనుచరుల సాయంతో తన కార్యకలాపాలు సాగించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇటీవల సల్మాన్ ఖాన్‌తో సన్నిహితంగా ఉండే బాబా సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ దారుణంగా హత మార్చింది. దీంతో మళ్లీ ఈ గ్యాంగ్ స్టర్ పేరు మార్మోగుతోంది. ఇదిలా ఉండగా లారెన్స్ బిష్ణోయ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని త్వరలో ఒక వెబ్‌సిరీస్‌ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం, ‘జానీ ఫైర్‌ఫాక్స్ ఫిల్మ్ ప్రొడక్షన్’ లారెన్స్ బిష్ణోయ్ జీవితంపై వెబ్ సిరీస్‌ను రూపొందించనుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ వెబ్ సిరీస్‌కి ‘లారెన్స్-ఎ గ్యాంగ్‌స్టర్ స్టోరీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారని సమాచారం. ఈ టైటిల్‌కి ఇండియన్ మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ పర్మిషన్ కూడా ఇచ్చిందని తెలుస్తోంది.

లారెన్స్ బిష్ణోయ్ ఎవరు? ఇంత పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడు? ఆయన జీవితంలో జరిగిన పలు సంఘటనల గురించి చాలా ఈ వెబ్ సిరీస్‌లో చూపించే అవకాశం ఉంది. ఇటీవల చోటుచేసుకున్న బాబా సిద్ధిఖీ హత్యను కూడా ఇందులో చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు. ఇక సల్మాన్ ఖాన్ పై లారెన్స్ ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నాడు. అందుకే బిష్ణోయ్ కు బాగా పబ్లిసిటీ వస్తోంది. మరి ‘లారెన్స్ – ఎ గ్యాంగ్‌స్టర్ స్టోరీ’ వెబ్ సిరీస్‌లో లారెన్స్ బిష్ణోయ్ పాత్రను ఎవరు పోషిస్తారోనని సినిమా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

దీపావళికి ఫస్ట్ లుక్..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి