ఆ ఒక్క అలవాటు మానుకుని 40 రోజుల్లో 7 కిలోలు తగ్గిన హీరోయిన్..

Rajitha Chanti

Pic credit - Instagram

17 March 2026

నటి శ్రుతిక 14 సంవత్సరాల వయసులో నటిగా అరంగేట్రం చేసింది. సూర్యతో కలిసి శ్రీ చిత్రంలో కనిపించింది. తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది శ్రుతిక.

తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. కానీ కుక్ విత్ కోమలి షో ద్వారా టెలివిజన్ తెరపైకి అడుగుపెట్టింది ఈ అమ్మడు.

 ఆ తర్వాత హిందీ బిగ్ బాస్ షో ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తన వెయిట్ లాస్ జర్నీ రివీల్ చేసింది.

శ్రుతిక 40 రోజుల్లో దాదాపు 7 కిలోల బరువు తగ్గిందట. ఇందుకోసం ఆమె కేవలం ఒకే రహస్యాన్ని అనుసరించిందని ఆమె ఫిట్నెస్ ట్రైనర్ దినేష్ తెలిపారు.

ఆ రహస్యం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కాఫీ ప్రియురాలైన శ్రుతి బరువు తగ్గడం ప్రారంభించినప్పటి నుంచి టీ, కాఫీ తాగడం పూర్తిగా మానేసిందట.

ఈ అలవాటు తాను బరువు తగ్గడానికి సహాయపడిందని చెప్పుకొచ్చారు. తన ఆహారాన్ని నియంత్రించడం ద్వారా మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని అన్నారు.

టీ, కాఫీ నివారించడం వల్ల మొత్తం ఆరోగ్యంలో అనేక సానుకూల మార్పులు వస్తాయి. వీటిలో అత్యధికంగా కెఫిన్ ఉంటుంది. తాగడం మానేస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

టీలోని టానిన్లు శరీరం ఇనుము, కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలను గ్రహించకుండా నిరోధిస్తాయి.  ఎముక,రక్త ఆరోగ్యం మెరుగుపడుతుంది అని చెప్పుకొచ్చారు.