Pragathi: నటి ప్రగతి కూతురిని చూశారా? తల్లికి తగ్గ అందం.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

ప్రగతి లేటెస్ట్ గా గోపిచంద్ విశ్వం సినిమాలో నటించింది. ఇందులో మరోసారి తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిందీ అందాల తార. అంతకు ముందు రాజ్ తరుణ్ నటించిన తిరగబడరా సామీ సినిమాలోనూ ఒక కీలక పాత్రలో నటించింది ప్రగతి. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు, మూడు సినిమాలున్నాయి.

Pragathi: నటి ప్రగతి కూతురిని చూశారా? తల్లికి తగ్గ అందం.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
Actress Pragathi
Follow us
Basha Shek

|

Updated on: Oct 17, 2024 | 8:44 PM

టాలీవుడ్ సీనియర్ నటీమణి ప్రగతి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం హీరోలు, హీరోయిన్లకైనా అమ్మ, అత్తమ్మ తదితర సహాయక పాత్రలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్. చాలా మంది లాగే హీరోయిన్ గా కెరీర్ ఆరంభించిన ప్రగతి కొన్ని కారణాలతో సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే సెకెండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ఆమె తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. ఇక ఈ మధ్యన సినిమాలు బాగా తగ్గించేసిన ప్రగతి పవర్ లిఫ్టింగ్ లోనూ సత్తా చాటుతోంది. యువతకు ఛాలెంజులు విసురుతూ ఈ విభాగంలోట్రోఫీలు కూడా గెల్చుకుంటోంది. ముఖ్యంగా గత ఏడాది బెంగళూరులో 28వ బెంచ్ ప్రెస్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్‌లో ప్రగతి ప్రొఫెషనల్స్‌తో పోటీ పడి 3వ స్థానంలో నిలిచింది. ప్రొఫెషనల్ లైఫ్ పరంగా సక్సెస్ అయినప్పటికీ పర్సనల్ లైఫ్ లో మాత్రం ప్రగతికి అన్నీ ఎదురు దెబ్బలే తగిలాయి. చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకున్న ఈ అందాల తార ఇద్దరు పిల్లలకు అమ్మగా మారింది. ఆ తర్వాత భర్త నుంచి విడిపోవడంతో ఇద్దరు పిల్లల బాధ్యతను భుజానకెత్తుకుంది. సింగిల్ మదర్ గా ఎన్నో కష్టాలు పడుతూ కొడుకు, కూతుర్లను పెంచి పెద్ద చేసింది. ప్రస్తుతం వీరిద్దరే సర్వస్వంగా జీవితం సాగిస్తోందీ అందాల తార.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రగతి తన సినిమా అప్డేట్స్ వివరాలు, అలాగే జిమ్ వీడియోలు, ఫొటోలను అందులో షేర్ చేస్తుంటుంది. అలాగే అప్పుడప్పుడు తన కూతురి ఫొటోలను కూడా పంచుకుంటుంది. ప్రగతి కూతురి పేరు గీత. గతేడాదే ప్లస్ టూ పూర్తి చేసింది. ఇక గీత కూడా ఎంతో క్యూట్ గా ఉంటోంది. అందంలో అచ్చం అమ్మనే తలపిస్తోంది.

ఇవి కూడా చదవండి

కూతురు గీతతో నటి ప్రగతి..

అయితే ప్రస్తుతం చదువుపైనే దృష్టి సారించిన గీత ఇండస్ట్రీలోకి వస్తుందో లేదో ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడు మాత్రం ప్రగతి కూతురు ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు ‘సినిమాల్లోకి ఎప్పుడు వస్తున్నారు మేడమ్’ అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

కుమారుడు, కూతురితో నటి ప్రగతి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే