AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: చెన్నైలో వర్ష బీభత్సం.. రజనీకాంత్ నివాసాన్ని ముంచెత్తిన వరద నీరు.. వీడియో వైరల్

దక్షిణాది భారతదేశంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా చెన్నైలో మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.

Rajinikanth: చెన్నైలో వర్ష బీభత్సం.. రజనీకాంత్ నివాసాన్ని ముంచెత్తిన వరద నీరు.. వీడియో వైరల్
Rajinikanth
Basha Shek
|

Updated on: Oct 16, 2024 | 2:04 PM

Share

చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం (అక్టోబర్ 16) ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోండడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో నగరంలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో రజనీకాంత్‌కు చెందిన పోయెస్‌ గార్డెన్‌ నివాసం కూడా వరద నీటిలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతంలో ఇల్లు ఉండడంతో ప్రాంగణమంతా వరద నీటితో నిండిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ వీడియోలో రజనీకాంత్, ఆయన కుటుంబ సభ్యులెవరూ కనిపించలేదు. రజనీకాంత్ ఇల్లు ఇలా వరద నీటిలో చిక్కుకోవడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో చెన్నైలో భారీ వర్షాలు కురిసిన ప్రతి సందర్భాల్లో సూపర్ స్టార్ ఇల్లు మునకకు గురైంది. కాగా భారీ వర్షాల కారణంగా చెన్నైలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తమిళనాడు ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. బుధవారం ఇంటి నుంచి పని చేయాలని పలు సంస్థలు ఆదేశాలు జారీ చేశాయి.

కాగా రజనీకాంత్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కడుపునొప్పి రావడంతో కొన్ని రోజుల వరకు ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకున్నారు. ఇటీవలే డిశ్చార్జి అ య్యి ఇంటికి చేరుకున్నారు. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత రజనీ మళ్లీ సినిమా షూటింగుల్లో పాల్గొనవచ్చని తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. రజనీకాంత్ నటించిన ‘వెట్టయాన్’ అక్టోబర్ 10న విడుదలైంది. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరు వసూళ్లు సాధించింది. తెలుగులోనూ ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. ఈ మూవీ సుమారు రూ.240 కోట్లు వసూళ్లు చేసినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.  ఇప్పుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ సినిమాచేయనున్నాడు రజనీ. త్వరలో ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు సూపర్ స్టార్. నాగార్జున, శ్రుతిహాసన్‌, సత్యరాజ్‌, ఉపేంద్ర తదితరులు కూడా ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనితో పాటు రజనీ లైనప్‌లో ‘జైలర్‌ 2’ సినిమా కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

వరద నీటిలో రజనీ నివాసం పోయెస్ గార్డెన్.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.