Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Teja: హీరో రవితేజ కూతురిని చూశారా? హీరోయిన్లకు మించిన అందం.. త్వరలోనే సినిమాల్లోకి కూడా!

మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్వశక్తితో స్టార్ హీరోగా ఎదిగిన అతికొద్ది మందిలో రవితేజ ఒకరు. కెరీర్ ప్రారంభంలో స్టార్ హీరోల సినిమాల్లో సైడ్ రోల్స్ పోషించిన ఆయన ఆ తర్వాత హీరోగా మారిపోయారు. ఎన్నో ఏళ్లుగా సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ తెలుగు ఆడియన్స్ ను అలరిస్తున్నారు

Ravi Teja: హీరో రవితేజ కూతురిని చూశారా? హీరోయిన్లకు మించిన అందం.. త్వరలోనే సినిమాల్లోకి కూడా!
Ravi Teja Family
Basha Shek
|

Updated on: Oct 14, 2024 | 5:18 PM

Share

మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్వశక్తితో స్టార్ హీరోగా ఎదిగిన అతికొద్ది మందిలో రవితేజ ఒకరు. కెరీర్ ప్రారంభంలో స్టార్ హీరోల సినిమాల్లో సైడ్ రోల్స్ పోషించిన ఆయన ఆ తర్వాత హీరోగా మారిపోయారు. ఎన్నో ఏళ్లుగా సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ తెలుగు ఆడియన్స్ ను అలరిస్తున్నారు. హిట్స్, ప్లాఫ్ తో సంబంధం లేకుండా తెలుగులో వేగంగా సినిమాలు చేసే హీరోల్లో రవితేజ ఒకరు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆయనలో ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గడం లేదని మాస్ మహారాజా సినిమాలు చూస్తే అర్థమవుతాయి. ఇటీవలే మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించిన రవితేజ ఇప్పుడు తన తర్వాతి సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నారు. కాగా సినిమా షూటింగుల నుంచి కాస్త గ్యాప్ తీసుకున్న రవితేజ ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లాడు. జపాన్, బ్యాంకాక్ తదితర చేశాలు చుట్టి వచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి కాస్తా వైరలయ్యాయి. ఈ ఫొటోలో రవితేజ, ఆయన భార్య, కొడుకు, కూతురుతోపాటు మరికొందరు బంధువులు కనిపించారు. అయితే అందరి దృష్టి మాత్రం కూతురు మోక్షద భూపతి రాజుపైనే నిలిచింది. బయట పెద్దగా కనిపించని ఆమె అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాత్రం సందడి చేస్తుంటుంది. ఎంతో క్యూట్ గా కనిపించే మోక్షద సినిమాల్లోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

అయితే రవితేజ కూతురు హీరోయిన్ గా కాకుండా నిర్మాతగా మారాలని నిర్ణయించుకుందట.తండ్రి బ్యానర్ అర్ టీ టీమ్ వర్క్స్ కాకుండా వేరే బ్యానర్ కూడా పెట్టబోతుందట. ఇందుకు రవితేజ కూడా ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే అంతకన్నా ముందు సితార సంస్థలో చేరి నిర్మాణ మెళకువలు నేర్చుకునే పనిలో ఉందట మోక్షద. ఇక రవితేజ తనయుడు మహాధన్ త్వరలోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే అతను కూడా హీరోగా కాకుండా డైరెక్టర్ గా తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. అందుకే గత కొన్నాళ్లుగా సందీప్‌ వంగ వద్ద మహాధన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్ గా వర్క్‌ చేస్తున్నాడట.

ఇవి కూడా చదవండి

వెకేషన్ లో రవితేజ ఫ్యామిలీ..

రవితేజ కుమారుడు, కూతురు ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.