Jani Master: ‘ఈ పాపం ఊరికే పోదు.. త్వరలోనే అన్నీ బయటపడతాయి’.. జానీ మాస్టర్ భార్య సంచలన వీడియో

మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో ప్రస్తుతం జైలులో ఉంటున్నాడు జానీ మాస్టర్. ప్రస్తుతం ఆయన  బెయిల్ పిటిషన్ కు సంబంధించి రంగా రెడ్డి ఫోక్సో కోర్టులో విచారణ జరుగుతోంది. ఇటీవలే దీనిపై వాదనలు విన్న రంగారెడ్డి ప్రత్యేక పోక్సో కోర్టు జానీ బెయిల్​పిటిషన్‌ ఈ నెల 14 కు వాయిదా వేసింది. అంటే సోమవారం మళ్లీ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది

Jani Master: 'ఈ పాపం ఊరికే పోదు.. త్వరలోనే అన్నీ బయటపడతాయి'.. జానీ మాస్టర్ భార్య సంచలన వీడియో
Jani Master Family
Follow us
Basha Shek

|

Updated on: Oct 20, 2024 | 9:18 PM

మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో ప్రస్తుతం జైలులో ఉంటున్నాడు జానీ మాస్టర్. ప్రస్తుతం ఆయన  బెయిల్ పిటిషన్ కు సంబంధించి రంగా రెడ్డి ఫోక్సో కోర్టులో విచారణ జరుగుతోంది. ఇటీవలే దీనిపై వాదనలు విన్న రంగారెడ్డి ప్రత్యేక పోక్సో కోర్టు జానీ బెయిల్​పిటిషన్‌ ఈ నెల 14 కు వాయిదా వేసింది. అంటే సోమవారం మళ్లీ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. అయితే ఇంతలోనే జానీ మాస్టర్ తల్లి బీబీజాన్ శనివారం (అక్టోబర్ 12) తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కుమారుడు జైలుకు వెళ్లడంతో బెంగ పెట్టుకున్న ఆమెకు గుండె పోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు బీబీ జాన్ ను నెల్లూరు బొల్లి నేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ విషయం తెలుసుకున్న జానీ మాస్టర్ సతీమణి సుమలతా అలియాస్ ఆయేషా ఆస్పత్రికి వచ్చారు. తన అత్తమ్మ ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు. ఈక్రమంలోనే జానీ మాస్టర్ అకౌంట్ నుంచే ఓ సంచలన పోస్ట్ పెట్టింది అయేషా. ఆస్పత్రిలో బెడ్ పై ఉన్న జానీ మాస్టర్ తల్లి వీడియోని తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..

అత్తమ్మ పరిస్థితి విషమంగా ఉంది…

‘నేషనల్ అవార్డు గురించి, కేసు గురించి నచ్చినట్టు రాస్తూ, నిజాలు నిర్ధారణవ్వకుండా, ఆరోపణల వెనుక అసలు ఉద్దేశమేంటో తెలుసుకోకుండా, కోర్టులో విచారణ జరుగుతుండగా తన కొడుకు గురించి ఎవరికి తోచింది వారు రాస్తూ, వినిపిస్తూ, చూపిస్తూ ఉండడంతో జానీ మాస్టర్ గారి అమ్మ గారు తీవ్ర మనస్తాపం చెంది గుండెపోటు వల్ల ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి తీవ్రంగానే ఉంది. అందరికీ కుటుంబాలు ఉంటాయి, ఈ పాపం ఊరికే పోదు… అసలు విషయాలు త్వరలోనే బయటికొస్తాయి’ అంటూ రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

జానీ మాస్టర్ భార్య షేర్ చేసిన వీడియో ఇదిగో..

ప్రస్తుతం అయేషా షేర్ చేసిన ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..