- Telugu News Photo Gallery Cinema photos Anchor Lasya Shares Her Bathukamma Celebrations Photos Go Viral
Anchor Lasya: బతుకమ్మ వేడుకల్లో యాంకర్ లాస్య.. ఫొటోస్ చూశారా?
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ సంబరాలను అందరూ ఘనంగా జరుపుకొన్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా మహిళలు, యవతులు బతుకమ్మలను పేర్చి వేడుకలు చేసుకున్నారు. అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆటపాటలతో సందడిగా గడిపారు.
Updated on: Oct 12, 2024 | 10:06 PM

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ సంబరాలను అందరూ ఘనంగా జరుపుకొన్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా మహిళలు, యవతులు బతుకమ్మలను పేర్చి వేడుకలు చేసుకున్నారు. అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆటపాటలతో సందడిగా గడిపారు.

బతుకమ్మ వేడుకల్లో సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా భాగమయ్యారు. ముఖ్యంగా సినీ తారలు బతుకమ్మలను ఏర్పాటుచేసి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు

ఈ క్రమంలో యాంకర్ లాస్య ఇంట్లోనూ బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. సందర్భంగా తమ ఇంట్లో పేర్చిన బతుకమ్మతో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ ఫొటోల్లో సంప్రదాయ చీరకట్టులో ఎంతో అందంగా కనిపించింది లాస్య. ప్రస్తుతం ఈ యాంకరమ్మ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

యాంకర్ లాస్య ఫొటోలను చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సో క్యూట్, బ్యూటిఫుల్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇక యాంకర్ లాస్య ఇంట దసరా నవరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా జరిగాయి. వీటికి సంబంధించిన ఫొటోలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసిందీ అందాల తార.