Actress: ఈ పాపను గుర్తు పట్టారా? తెలుగు ఆడియెన్స్‌కు ఫేవరెట్ హీరోయిన్.. 40 ఏళ్లు దాటినా చెక్కు చెదరని అందం

సాధారణంగా సినిమా హీరోయిన్ అంటే స్కిన్ షో చేయాల్సిందేనన్న భావన చాలా మందిలో ఉంది. అభినయ ప్రతిభ ఉన్నప్పటికీ ఆడియెన్స్ ను ఆకట్టుకోవాలంటే గ్లామర్ ఒలకబోయాల్సిందేనన్న అభిప్రాయాలు వినిపిస్తుంటాయి. ఇందులో ఎంతో కొంత నిజముంది. అయితే సిల్వర స్క్రీన్‌పై ఎక్స్ పోజింగ్ చేయకుండానే స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వారు కూడా ఉన్నారు.

Actress: ఈ పాపను గుర్తు పట్టారా? తెలుగు ఆడియెన్స్‌కు ఫేవరెట్ హీరోయిన్.. 40 ఏళ్లు దాటినా చెక్కు చెదరని అందం
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Oct 12, 2024 | 7:44 PM

సాధారణంగా సినిమా హీరోయిన్ అంటే స్కిన్ షో చేయాల్సిందేనన్న భావన చాలా మందిలో ఉంది. అభినయ ప్రతిభ ఉన్నప్పటికీ ఆడియెన్స్ ను ఆకట్టుకోవాలంటే గ్లామర్ ఒలకబోయాల్సిందేనన్న అభిప్రాయాలు వినిపిస్తుంటాయి. ఇందులో ఎంతో కొంత నిజముంది. అయితే సిల్వర స్క్రీన్‌పై ఎక్స్ పోజింగ్ చేయకుండానే స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వారు కూడా ఉన్నారు. స్కిన్ సో చేయకుండా సినిమా ఆడియెన్స్ కు ఫేవరెట్ యాక్ట్రెస్ గా మారిన కథానాయికలు కూడా ఉన్నారు. అలాంటి వారి గురించి మాట్లాడుకుంటే మొదట గుర్తుకు వచ్చే పేరు సావిత్రి, ఆతర్వాత సౌందర్య. అయితే ఈ అరుదైన జాబితాలో మరో హీరోయిన్ కూడా చేరింది. పై ఫొటోలో ఉన్నది ఆమెనే. ఇప్పుడీ అమ్మాయి దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. గ్లామర్ కు దూరంగా కేవలం హోమ్లీ రోల్స్ పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయం పరంగా జూనియర్ సౌందర్యగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. పెళ్లయినా అందం విషయంలో కానీ, పాపులారిటీ విషయంలో కానీ ఈ ముద్దుగుమ్మ అసలు తగ్గడం లేదు. మరి ఈ పాటికే అర్థమై ఉంటుంది పై ఫొటోలో ఉన్న క్యూటీ ఎవరో.. యస్.. తను మరెవరో కాదు బాపు బొమ్మగా, జూనియర్ సౌందర్యగా గుర్తింపు తెచ్చుకున్న స్నేహ. శనివారం (అక్టోబర్ 12) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ ముద్దుగుమ్మకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇదే క్రమంలో స్నేహ చిన్ననాటి, అరుదైన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

కాగా గతేడాది రెండు సినిమాల్లో నటించింది స్నేహ. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి సరసన క్రిస్టోఫర్ అనే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లో కీలక పాత్ర పోషించిందీ అందాల తార. అలాగే తమిళంలో ఒక మూవీలో నటించింది. ఇక ఈ ఏడాది విజయ్ హీరోగా నటించిన ది గోట్ మూవీతో మరోసారి ఆడియెన్స్ ను పలకరించిందీ ముద్దుగుమ్మ. పెళ్లి తర్వాత ఎక్కువగా సహాయక పాత్రల్లో కనిపిస్తోన్న స్నేహ ది గోట్ మూవీలో మాత్రం విజయ్ కు భార్యగా నటించింది. ప్రస్తుతం తన ఫ్యామిలీకే ఎక్కువ ప్రాధాన్యమిస్తోందామె. అందుకే సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది.

హీరో విజయ్ తో స్నేహ..

View this post on Instagram

A post shared by Sneha (@realactress_sneha)

భర్తతో స్నేహ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!