RRR Movie: ‘ఆర్ఆర్ఆర్ సినిమా అంటే చాలా ఇష్టం.. మూడు నెలలకొకసారైనా చూస్తాం’: ప్రముఖ హాలీవుడ్ నటి

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం భారతీయ సినిమా ముఖ చిత్రాన్ని మార్చేసిందని చెప్పడంలో ఎలాంటి అతి శయోక్తి లేదు. ఆస్కార్ కు వెళ్లిన ఈ సినిమా అంతకు ముందే అమెరికా సహా పలు దేశాల్లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విదేశీయులు సైతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా చూసి ప్రశంసల వర్షం కురిపించారు

RRR Movie: 'ఆర్ఆర్ఆర్ సినిమా అంటే చాలా ఇష్టం.. మూడు నెలలకొకసారైనా చూస్తాం': ప్రముఖ హాలీవుడ్ నటి
RRR movie. Minnie Driver
Follow us
Basha Shek

|

Updated on: Oct 11, 2024 | 6:44 PM

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం భారతీయ సినిమా ముఖ చిత్రాన్ని మార్చేసిందని చెప్పడంలో ఎలాంటి అతి శయోక్తి లేదు. ఆస్కార్ కు వెళ్లిన ఈ సినిమా అంతకు ముందే అమెరికా సహా పలు దేశాల్లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విదేశీయులు సైతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా చూసి ప్రశంసల వర్షం కురిపించారు. కేవలం సినీ ప్రేక్షకులే కాదు, హాలీవుడ్‌లోని పెద్ద టెక్నీషియన్లు, నిర్మాతలు, సినీ తారలు కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని వీక్షించి ఎంతగానో మెచ్చుకున్నారు. ఇప్పుడు హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న ఓ బ్రిటీష్ స్టార్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఆమె ఎవరో కాదు మిన్నీ డ్రైవర్. ఏఎన్‌ఐతో మాట్లాడిన ఆమె.. ‘ఆర్‌ఆర్‌ఆర్ సినిమా అంటే నాకు, నా కొడుకు చాలా ఇష్టం. మూడు గంటల సినిమా అయినప్పటికీ మేం ఎంతో ఆసక్తి గా ఈ సినిమాను చూస్తాం. నేనూ, నా కొడుకు ప్రతి మూడు నెలలకోసారి కూర్చుని ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తాం. ఈ మధ్య కాలంలో నేను చూసిన అద్భుతమైన సినిమా ఇది’ అని చెప్పుకొచ్చారు.

భారత్‌పై తనకున్న ప్రేమ గురించి మిన్నీ డ్రైవర్ మాట్లాడుతూ.. ‘ప్రముఖ చెఫ్ రోమీ గిల్ నాకు మంచి స్నేహితురాలు. నేను ఆమె ద్వారా భారతదేశం గురించి చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను భారతీయ వంటకాలను రుచి చూశాను. నాకు పంజాబీ, పశ్చిమ బెంగాల్ బాగా తెలుసు. నేను భారతదేశమంతా పర్యటించాలనుకుంటున్నాను. . వీలైనంత త్వరగా ఆ కోరిక నెరవేర్చుకుంటాను’ అని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇండియా అంటే చాలా ఇష్టం..

View this post on Instagram

A post shared by Min. (@driverminnie)

కాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా అమెరికాలో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇది ఆస్కార్‌లో ప్రదర్శింపబడినప్పుడు కూడా, స్టిఫెల్ స్పీల్‌బర్గ్, జేమ్స్ కెమెరూన్ వంటి గొప్ప దర్శకులు సినిమాను మెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే హాలీవుడ్‌లో చిత్రానికి దర్శకత్వం వహించమని దర్శకుడు రాజమౌళిని ఆహ్వానించారు. తానే స్వయంగా ప్రొడక్షన్ హౌస్‌తో మాట్లాడతానని జేమ్స్ చెప్పాడు. నెట్‌ఫ్లిక్స్ సీఈఓ కూడా ‘RRR’ సినిమాను చాలాసార్లు చూశానని పేర్కొన్నారు.

త్వరలోనే భారతదేశమంతా పర్యటిస్తా..

View this post on Instagram

A post shared by Min. (@driverminnie)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..
అన్‌సోల్డ్ ఆడిన మ్యాజిక్: ఐపీఎల్ వేలం మిస్.. షాక్ లో కావ్య పాపా
అన్‌సోల్డ్ ఆడిన మ్యాజిక్: ఐపీఎల్ వేలం మిస్.. షాక్ లో కావ్య పాపా