AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Rakesh: బుజ్జి పాపతో ఇంటికి జబర్దస్త్ కపుల్.. రాకింగ్ రాకేష్ దంపతులకు గ్రాండ్ వెల్కమ్.. వీడియో

జబర్దస్త్ కపుల్ రాకింగ్ రాకేష్- జోర్దార్ సుజాత ఇటీవలే అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. సుజాత పండంటి ఆడ బిడ్డను ప్రసవించింది. ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు రాకింగ్ రాకేష్- జోర్దార్ సుజాత. దీంతో పలువురు సినీ, బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు జబర్దస్త్ కపుల్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

Jabardasth Rakesh: బుజ్జి పాపతో ఇంటికి జబర్దస్త్ కపుల్.. రాకింగ్ రాకేష్ దంపతులకు గ్రాండ్ వెల్కమ్.. వీడియో
Jabardasth Rocking Rakesh Family
Basha Shek
|

Updated on: Oct 10, 2024 | 12:33 PM

Share

జబర్దస్త్ కపుల్ రాకింగ్ రాకేష్- జోర్దార్ సుజాత ఇటీవలే అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. సుజాత పండంటి ఆడ బిడ్డను ప్రసవించింది. ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు రాకింగ్ రాకేష్- జోర్దార్ సుజాత. దీంతో పలువురు సినీ, బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు జబర్దస్త్ కపుల్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఓ ఆస్పత్రిలో సుజాత ప్రసవం జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. పండంటి పాపతో ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలోనే వారికి ఘన స్వాగతం లభించింది. ఇరు కుటుంబ సభ్యులు తల్లీ కూతుళ్లకు గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఈ సందర్భంగా ఇంటిని పూలతో అందంగా అలంకరించారు. అలాగే అందరికీ స్వీట్లు పంచి పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు రాకింగ్ రాకేష్- జోర్దార్ సుజాత. ‘మా ఇంటి మహాలక్ష్మి ఇంట్లో అడుగు పెట్టిన వేళ’ అంటూ షేర్ చేసిన ఈ వీడియోలో ఆస్పత్రి దగ్గరి నుంచి బయలు దేరిన క్షణం మొదలు ఇంట్లో కి వెళ్లడం దాకా జరిగిన అద్భుత క్షణాలను ఇందులో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు రాకింగ్ రాకేష్ దంపతులకు మరోసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత ఒకరు. ఈ వేదికపై జంటగా పలు కామెడీ స్కిట్లు చేసి బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారీ స్టార్ కమెడియన్స్. ఇదే సమయంలో ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. దీంతో రీల్ లైఫ్‌లో జంటగా నటించిన వీరిద్దరు నిజ జీవితంలోనూ జోడీగా మారారు. జబర్దస్త్ వేదికపైనే తమ ప్రేమ విషయాన్నిఅధికారికంగా బయట పెట్టారీ ప్రేమ పక్షులు. ఆ తర్వాత ఇరు పెద్దల అనుమతితో పెళ్లిపీటలెక్కారు. గతేడాది ఫిబ్రవరి 24న తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి సాక్షిగా రాకింగ్ రాకేష్- జోర్దార్ సుజాతల వివాహం జరిగింది. ఇప్పుడు వీరి వైవాహిక బంధానికి ప్రతీకగా ఒక పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారీ లవ్లీ కపుల్.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మరో 20 రోజులు వీరికి అదృష్టం.. ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు!
మరో 20 రోజులు వీరికి అదృష్టం.. ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు!
కళ్లద్దాలతో యూపీఐ పేమెంట్స్.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇలా..
కళ్లద్దాలతో యూపీఐ పేమెంట్స్.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇలా..
షుగర్ ఉన్నవారికి దాల్చినచెక్క మంచిదేనా? డాక్టర్ దీక్షా చెప్పిన
షుగర్ ఉన్నవారికి దాల్చినచెక్క మంచిదేనా? డాక్టర్ దీక్షా చెప్పిన
శని అమావాస్య నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టం కలిసొస్తుందట!
శని అమావాస్య నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టం కలిసొస్తుందట!
ఒక్క రాత్రిలోనే రూ. 54 కోట్ల చోరీ.. 600 ఏళ్ల నాటి చరిత్రలోనే అతి
ఒక్క రాత్రిలోనే రూ. 54 కోట్ల చోరీ.. 600 ఏళ్ల నాటి చరిత్రలోనే అతి
టీ20 చరిత్రలో రెండోసారి అరుదైన రికార్డు
టీ20 చరిత్రలో రెండోసారి అరుదైన రికార్డు
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అందుబాటులోకి అప్పుడే..!
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అందుబాటులోకి అప్పుడే..!
లైక్‌లు, కామెంట్ల పిచ్చి.. మీ మానసిక ఆరోగ్యాన్ని మీరే..
లైక్‌లు, కామెంట్ల పిచ్చి.. మీ మానసిక ఆరోగ్యాన్ని మీరే..
ఢిల్లీ ఫ్యాన్స్‌కు షాక్.. భారత్-శ్రీలంక మ్యాచ్ వేదిక మార్పు
ఢిల్లీ ఫ్యాన్స్‌కు షాక్.. భారత్-శ్రీలంక మ్యాచ్ వేదిక మార్పు
ట్రైన్ రద్దయితే రీఫండ్ మొత్తం వస్తుందా..? రైల్వేశాఖ రూల్స్..
ట్రైన్ రద్దయితే రీఫండ్ మొత్తం వస్తుందా..? రైల్వేశాఖ రూల్స్..