Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ ఓటింగ్‌లో గంగవ్వ హవా.. డేంజర్ జోన్‌లో ఊహించని కంటెస్టెంట్స్.. ఎలిమినేషన్ తప్పదా?

ఈ వారం హౌస్ కలర్ ఫుల్ గా ఉంది. దీనికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాత కంటెస్టెంట్స్ కి తోడుగా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. దీంతో పాత, కొత్త కంటెస్టెంట్లతో హౌస్ కోలాహలంగా కనిపిస్తోంది.

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ ఓటింగ్‌లో గంగవ్వ హవా.. డేంజర్ జోన్‌లో ఊహించని కంటెస్టెంట్స్.. ఎలిమినేషన్ తప్పదా?
Bigg Boss 8 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Oct 09, 2024 | 12:05 PM

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా కొనసాగుతోంది. సెప్టెంబర్ 1న గ్రాండ్ గా ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే ఐదు వారాలు పూర్తి చేసుకుంది. సక్సెస్ ఫుల్ గా అరోవారంలోకి అడుగు పెట్టింది. అయితే ఈ వారం హౌస్ కలర్ ఫుల్ గా ఉంది. దీనికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాత కంటెస్టెంట్స్ కి తోడుగా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. దీంతో పాత, కొత్త కంటెస్టెంట్లతో హౌస్ కోలాహలంగా కనిపిస్తోంది. మొత్తం 14 మందితో మొదలైన బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ లో ఐదు వారాలలో ఆరు మంది బయటికి వెళ్లిపోయారు. అలాగే మరో ఎనిమిది మంది వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగు పెట్టారు. దీంతో ప్రస్తుతం 16 మంది సభ్యులు బిగ్ బాస్ ట్రోఫీ కోసం పోటీపడుతున్నారు. ఎప్పటిలాగే ఆరో వారం కూడా నామినేషన్స్ ప్రక్రియ హోరాహోరీగా సాగింది. కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు పంచులేసుకుంటూ నామినేట్ చేసుకున్నారు. అలా ఆరోవారంలో మొత్తం ఆరుగురు నామినేషన్స్ లోకి వచ్చారు. కిరాక్ సీత, విష్ణు ప్రియ, పృథ్వి, యష్మి గౌడ, మెహబూబ్, గంగవ్వలు నామినేషన్స్ జాబితాలో నిలవగా, వీరికి ఆన్ లైన్ ఓటింగ్ కూడా ప్రారంభమైంది.

ఈసారి బిగ్ బాస్ ఆన్ లైన్ ఓటింగ్ ప్రక్రియలో షాకింగ్ రిజల్ట్ కనబడుతోంది. వైల్డ్ కార్డు ఎంట్రీ కంటెస్టెంట్స్ ఈ వారం ఓటింగ్ లో సత్తా చాటుతున్నారు. ఊహించని విధంగా గంగవ్వ ప్రస్తుతం బిగ్ బాస్ ఓటింగ్ లో టాప్ లో నిలిచారు. ఆమెకు సుమారు 30 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. అలాగే రెండో ప్లేస్ లో ఉన్న విష్ణుప్రియకు 20 శాతం ఓట్లు పడ్డాయి.ఆ తర్వాత పృథ్వీకి 16 శాతం, యష్మి కి 14 శాతం, మెహబూబా దిల్సేకు 14 శాతం ఓట్లు నమోదయ్యాయి. ఇక చివరిగా కిర్రాక్ సీత కేవలం 7 శాతం ఓట్లతో తో డేంజర్ జోన్ లో నిలిచింది. కాగా కిర్రాక్ సీత టాప్ లో ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఆమే ఏకంగా డేంజర్ జోన్ లోకి వచ్చేసింది. ఓటింగ్ సరళి ఇలాగే కొనసాగితే సీత ఎలిమినేట్ అవ్వడం గ్యారంటీ.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.