- Telugu News Photo Gallery Cinema photos Tollywood Actress Shraddha Arya Shares Her Baby Shower Celebrations Photos
Shraddha Arya: తల్లి కాబోతోన్న టాలీవుడ్ హీరోయిన్.. గ్రాండ్‌గా సీమంతం.. ఫొటోస్ ఇదిగో
ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా ఆర్య త్వరలో తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. ప్రస్తుతం నిండు గర్బంతో ఉన్న ఆమె త్వరలో తల్లిగా ప్రమోషన్ పొందనుంది. కొన్ని రోజల క్రితమే ప్రెగ్నెన్సీ ని ప్రకటించిన ఆమెకు పలువురు సినీ ప్రముఖులు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
Updated on: Oct 07, 2024 | 1:54 PM

ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా ఆర్య త్వరలో తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. ప్రస్తుతం నిండు గర్బంతో ఉన్న ఆమె త్వరలో తల్లిగా ప్రమోషన్ పొందనుంది. కొన్ని రోజల క్రితమే ప్రెగ్నెన్సీ ని ప్రకటించిన ఆమెకు పలువురు సినీ ప్రముఖులు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

అమ్మ' అనే పిలుపునకు దగ్గరగా ఉన్న శ్రద్ధ ఆర్యకు ఘనంగా సీమంతం నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు పాల్గొన్నారు.

తన సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది శ్రద్ధ ఆర్యా . దీంతో అవి కాస్తా నెట్టింట వైరలవుతున్నాయి.

శ్రద్ధా ఆర్య 2006లో కల్వనిన్ కదాలి అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.

2007లో గొడవ సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమైందీ అందాల తార. కోదండ రామిరెడ్డి తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో వైభవ్ హీరోగా నటించాడు. దీని తర్వాత రోమియో, కోతిమూక తదితర తెలుగు సినిమాల్లో కనిపించింది శ్రద్ధ.

కాగా శ్రద్ధ 2021 నవంబర్‌లో రాహుల్ నాగల్ అనే నేవీ ఆఫీసర్‌ను వివాహం చేసుకుంది. ఇప్పుడీ మూడేళ్ల వైవాహిక బంధానికి ప్రతీకగా ఒక పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానిస్తోందీ అందాల తార.