- Telugu News Photo Gallery Cinema photos Actress Manchu Lakshmi Birthday Celebrations at Mumbai, Photos Go Viral
Manchu Lakshmi: ముంబైలో మంచు లక్ష్మి బర్త్ డే సెలబ్రేషన్స్.. సందడి చేసిన సుస్మితా సేన్, రకుల్.. ఫొటోస్ చూశారా?
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మంచు లక్ష్మి. నటిగా, సింగర్‌గా, నిర్మాతగా, యాంకర్‌గా ఇలా విభిన్న రంగాల్లో తన ట్యాలెంట్ ను నిరూపించుకుంది.
Updated on: Oct 06, 2024 | 6:22 PM

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మంచు లక్ష్మి. నటిగా, సింగర్‌గా, నిర్మాతగా, యాంకర్‌గా ఇలా విభిన్న రంగాల్లో తన ట్యాలెంట్ ను నిరూపించుకుంది.

కాగా మంచు వారమ్మాయి గత కొన్ని నెలలుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. అయితే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటోంది.

ఆ మధ్యన పేద విద్యార్థుల కోసం తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి అందరి మన్ననలు అందుకుంది మంచు లక్ష్మి.

కాగా మంచు లక్ష్మి వేడుకలు ముంబై లో ఘనంగా జరిగాయి. టాలీవుడ్, బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలకు చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొన్నారు.

బాలీవుడ్ అందాల తార సుస్మితా సేన్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె భర్త జాకీ భగ్నానీ, మధు బాల, సీరత్ కపూర్ తదితర సినీ ప్రముఖులు ఈ బర్త్ డే బాష్ లో పాల్గొన్నారు.

ప్రస్తుతం మంచు లక్ష్మి పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.





























