Horoscope Today: వారు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు..12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (March 12, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. వృషభ రాశి ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యలు సమసిపోతాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు మారే అవకాశం ఉంది. కొద్దిపాటి మార్పులు చోటు చేసుకుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

దిన ఫలాలు (మార్చి 12, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి ఉద్యోగులకు డిమాండ్ పెరిగే సూచనలు ఉన్నాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు మారే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, వ్యాపారాల్లో భారీగా మార్పులు చేపట్టడం జరుగుతుంది. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తవుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. కుటుంబ జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిచిపోతుంది. జీవిత భాగస్వామి ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. పిల్లలు పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగులకు కూడా డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యలు సమసిపోతాయి. కొన్ని శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు ఆశించిన రీతిలో కొన్ని ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. బంధువుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు మారే అవకాశం ఉంది. కొద్దిపాటి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలకు ఇబ్బందేమీ ఉండదు. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు ఇబ్బంది పెడతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగ జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు, ఆదరణ లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన శుభవార్త వింటారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. అధికారులు ప్రత్యేక బాధ్యతలతో ప్రోత్సహిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. శ్రమకు తగ్గ ఫలితం అందుతుంది. పెండింగ్ పనుల్ని పూర్తి చేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందు తాయి. పిల్లల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. వృథా ఖర్చులు పెరుగుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారంలో కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు ఆశించిన సత్ఫలితాలనిస్తాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సమస్యల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తలు పాటించడం మంచిది. ప్రయాణాలు లాభిస్తాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. అధికారులు ప్రత్యేక బాధ్యతలతో ప్రోత్సహిస్తారు. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయం బాగానే ఉంటుంది. అవనసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలుంటాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇంటి పరిస్థితి సాఫీగా సాగిపోతుంది. అవసర సమయాల్లో జీవిత భాగస్వామి సహాయం లభిస్తుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో అధికారుల వల్ల పని భారం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీ ఉన్నా లాభాలకు లోటుండదు. మిత్రుల సహాయంతో పనులన్నీ పూర్తవుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. కొందరు బంధువులతో అపార్థాలు తలెత్తవచ్చు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం కొనసాగుతాయి. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో కీలక మార్పులు చేపడతారు. లాభాలకు ఢోకా ఉండదు. ముఖ్యమైన పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. కొందరు బంధుమిత్రులకు అండగా నిలబడతారు. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఆదాయానికి లోటుండదు కానీ, వృథా ఖర్చులు పెరుగుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో ఒత్తిడి కాస్తంత తగ్గే అవకాశం ఉంది. బాధ్యతల్లో మార్పులు జరుగుతాయి. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ ఖర్చులతో ఇబ్బంది పడతారు. పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. విదేశాల నుంచి ఉద్యోగపరంగా ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదం నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇష్టమైన బంధువులతో శుభ కార్యంలో పాల్గొంటారు. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాలలో ఊహించని పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. కుటుంబ విషయాల్లో కొద్దిగా పారదర్శకంగా వ్యవహరించడం మంచిది. ఇంట్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. ఆదాయం బాగానే వృద్ది చెందుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల వల్ల ఒత్తిడి ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.