Alia Bhatt: వర్క్ వేరు.. ఫ్యామిలీ వేరు.. రెండింటి బ్యాలెన్స్ పై అలియా కామెంట్స్.!
వర్క్ లైఫ్ బ్యాలన్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. నిన్నటి టైమ్ టేబుల్ ఇవాళ్టికి అప్లై కాదు.. ఎప్పటికప్పుడు ఫ్రెష్ టాస్క్స్, ఫ్రెష్ ఎపిసోడ్స్ ని డీల్ చేయాల్సి ఉంటుంది. అలా చేయాలంటే, మనల్నిమనం సిద్ధంగా ఉంచుకోవాలని అంటున్నారు ఆలియా.. ముద్దుల తనయ రాహా గురించి కూడా మాట్లాడారు ఈ బ్యూటీ. బాలీవుడ్‌లో ఇప్పుడు అందరి దృష్టినీ ఆకట్టుకుంటున్న జంట రణ్‌బీర్ కపూర్, ఆలియా.