- Telugu News Photo Gallery Cinema photos Heroine sreeleela looking for solid come back in Tollywood with her next movies Telugu Actress Photos
Sreeleela: సినిమా లేకపోతే ఏమి.. వార్తలు ఉంటున్నగా అంటున్న క్యూట్ బ్యూటీ శ్రీలీల.
కనిపించడం లేదు.. అనే పదాన్ని కనిపించకుండా చేయాలనుకుంటున్నారు నటి శ్రీలీల. అందుకే వీలైనంతగా వార్తల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా ఆమె ఇండస్ట్రీ గురించి, కాంపిటిషన్ గురించి చెప్పిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. అసలు ఇండస్ట్రీలో పోటీతత్వం ఉండనే ఉండదని అంటున్నారు ఈ బ్యూటీ. తాను సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నప్పటి నుంచీ ఎవరినీ పోటీగా ఫీలవలేదట మిస్ లీల.
Updated on: Oct 06, 2024 | 1:01 PM

కనిపించడం లేదు.. అనే పదాన్ని కనిపించకుండా చేయాలనుకుంటున్నారు నటి శ్రీలీల. అందుకే వీలైనంతగా వార్తల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

లేటెస్ట్ గా ఆమె ఇండస్ట్రీ గురించి, కాంపిటిషన్ గురించి చెప్పిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. అసలు ఇండస్ట్రీలో పోటీతత్వం ఉండనే ఉండదని అంటున్నారు ఈ బ్యూటీ.

తాను సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నప్పటి నుంచీ ఎవరినీ పోటీగా ఫీలవలేదట మిస్ లీల. ఎవరి ప్రతిభకు తగ్గట్టు వారికి ఆఫర్లు వస్తూనే ఉంటాయని అంటున్నారు.

అంతే కాదు, సినిమా ఇండస్ట్రీని పుష్పక విమానంతో పోలుస్తున్నారు ఈ భామ. సినిమా సినిమాకూ తనలో ఉన్న టాలెంట్‌ని మెరుగుపరచుకోవాలన్నది మాత్రమే తన లక్ష్యమని అంటున్నారు శ్రీలీల.

ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటే, ఏ ఇండస్ట్రీలోనైనా టాప్‌లో కొనసాగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.'

తన సహ నటీమణుల్లో ఎవరైనా బాగా నటిస్తే వాళ్లను మెచ్చుకోవడంలో తానెప్పుడూ ముందే ఉంటానన్నది శ్రీలీల స్టేట్‌మెంట్.

అంతే కాదు, వాళ్లతో పోటీ పడాలనో, వాళ్ల అవకాశాల గురించి ఆరా తీయాలనో తనకెప్పుడూ అనిపించదట. తనిలా ఆలోచిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంటుందని అంటున్నారు ఈ లేడీ.




