AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ugadi Astrology: అపర కుబేర యోగం.. ఉగాది నుంచి వారు వస్త్రాభరణాలు కొనే ఛాన్స్..!

Ugadi 2026 Astrology: రాజయోగ, ధనయోగ గ్రహాలైన రవి, శుక్రులు రాశులు ఈ నెల (ఫిబ్రవరి) 15 నుంచి మారడం రాశులు మారడంతో పాటు, ధన కారకుడైన గురువు వక్ర త్యాగం చేస్తున్నందువల్ల ఉగాది తర్వాత కొన్ని రాశుల వారు స్వర్ణాభరణాల మీదా, షేర్లు, స్పెక్యులేషన్ల మీదా భారీగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. వీరికి ఆస్తిపాస్తులు కలిసి రావడం, లాటరీ రావడం, ఆస్తిపాస్తులు విలువ పెరగడం. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరగడం వంటివి తప్పకుండా జరుగుతాయి. మేషం, మిథునం, కర్కాటకం, తుల, దనుస్సు, మకర రాశుల వారు విశేషంగా వస్త్రాభరణాలు కొనే అవకాశం ఉంది. వీరికి అపర కుబేర యోగం, లక్ష్మీ యోగం కలుగుతాయి.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 11, 2026 | 7:13 PM

Share
మేషం: రెండు నెలల కాలంలో రవి, శుక్రులు ఈ రాశికి అనుకూలం కావడం వల్ల ఈ రాశివారికి తప్ప కుండా అపర కుబేర యోగం కలిగే అవకాశం ఉంది. మార్చి 19న వచ్చే ఉగాది నుంచి భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేయడం, గృహ, వాహన ప్రయత్నాల మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.

1 / 6
మిథునం: ఉగాది తర్వాత ఈ రాశికి లాభ స్థానంలో శుక్రుడు ప్రవేశించిన దగ్గర నుంచి ఈ రాశివారు వస్త్రాభరణాలు కొనడం, విలువైన వస్తు సామగ్రి కొనుగోలు చేయడం, ఆధునిక సౌకర్యాలు అమర్చుకోవడం ఎక్కువవుతుంది. ఆకస్మిక ధన లాభంతో పాటు, అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందడం ప్రారంభం అవుతుంది. శుక్రుడితో కుబేర యోగం ఏర్పడడం వల్ల ఆస్తిపాస్తులు లభించడంతో పాటు ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. లాటరీ వచ్చే అవకాశం ఉంది.

2 / 6
కర్కాటకం: ఈ రాశికి భాగ్య, దశమ స్థానాల్లో రవి, శుక్రుల సంచారం వల్ల అపారమైన ధన లాభం కలుగుతుంది. వీరిని అనేక విధాలుగా ధన లక్ష్మి కరుణిస్తుంది. సగటు వ్యక్తి సైతం సంపన్నుడు కావడా నికి అవకాశాలు లభిస్తాయి. ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం వరిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వస్త్రాభరణాలు వృద్ధి చెందుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి. రావలసిన సొమ్ము, బాకీలు వసూలవుతాయి.

3 / 6
తుల: రాశ్యధిపతి శుక్రుడు, లాభాధిపతి రవి ఈ నెల 15 నుంచి బాగా బలపడుతున్నందువల్ల ఈ రాశి వారు వస్త్రాభరణాల మీదా, గృహ, స్థలాల మీదా భారీగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లో కూడా అపారంగా ధన లాభం కలుగుతుంది. షేర్లు, స్పెక్యు లేషన్లతో సహా అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆస్తి విలువ బాగా పెరుగుతుంది.

4 / 6
ధనుస్సు: ఈ రాశికి చతుర్థ, పంచమ స్థానాల్లో రవి, శుక్రుల సంచారం, రాశినాథుడు ఈ రాశిని వీక్షించడం వంటి కారణాల వల్ల ఈ రాశివారి ఆదాయం, సంపాదన బాగా పెరిగే అవకాశం ఉంది. రికార్డు స్థాయిలో వస్త్రాభరణాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఆస్తి లాభం, భూలాభం కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి.

5 / 6
మకర రాశి వారికి ఈ ఉగాది నుంచి చిక్కులు, చికాకులు ఎక్కువ అవుతుంది. అధిక పెట్టుబడులు వలన నష్టాలు తప్ప లాభాలు అసలు రావు. ఇంకా వీరి జీవితంలో ఎన్నో సవాళ్లు వస్తాయి వాటిని ఎదుర్కోవాలి. అలాగే, మీరు ఈ సమయంలో మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలి.   అలాగే, మీ ఫ్రెండ్స్ తో ఎలాంటి గొడవలు పడకండి.

6 / 6
Follow Us