AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mole Astrology: అమ్మాయిల జీవితాన్ని మార్చే పుట్టుమచ్చలు.. శరీరంలో ఆ ప్లేస్‌లో ఉంటే..

అంగసాముద్రికంలో పుట్టుమచ్చలు కీలక పాత్ర పోషిస్తాయి. తేనె రంగు, నలుపు రంగు పుట్టుమచ్చలుంటాయి. స్త్రీలకు ఎడమ వైపు, పురుషులకు కుడి వైపు ఉన్నవి మంచి ఫలితాలనిస్తాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి చెక్ చేయండి. స్టోరీ చూసేయండి మరి.

Mole Astrology: అమ్మాయిల జీవితాన్ని మార్చే పుట్టుమచ్చలు.. శరీరంలో ఆ ప్లేస్‌లో ఉంటే..
Moles On Body
Ravi Kiran
|

Updated on: Mar 11, 2026 | 9:24 PM

Share

అంగసాముద్రికం అనేది ప్రాచీన భారతీయ శాస్త్రాలలో ఒకటి. ఇది మనిషి శరీరంపై ఉన్న వివిధ గుర్తులు, ముఖ్యంగా పుట్టుమచ్చల ద్వారా వారి భవిష్యత్తు, స్వభావం, అదృష్టం, దురదృష్టాలను అంచనా వేస్తుంది. హస్త శాస్త్ర నిపుణులు దీని గురించి వివరించారు. పుట్టుమచ్చల శాస్త్రం నిజంగా ఉందా అనే సందేహానికి, ఇది 100 శాతం నిజమని స్పష్టం చేశారు. మనిషిని గుర్తించడానికి పుట్టుమచ్చలు ఉపయోగపడతాయని వివరించారు. పుట్టుమచ్చలు ప్రధానంగా రెండు రకాలు: తేనె రంగు పుట్టుమచ్చలు, నలుపు రంగు పుట్టుమచ్చలు. ఈ రంగులు వాటి ఫలితాలపై ప్రభావాన్ని చూపుతాయి. వీటి ఫలితాలు స్త్రీలకు, పురుషులకు భిన్నంగా ఉంటాయి. సాధారణంగా, స్త్రీలకు శరీరం ఎడమ వైపున ఉన్న పుట్టుమచ్చలు శుభప్రదమైన ఫలితాలను ఇస్తే, పురుషులకు కుడి వైపున ఉన్న పుట్టుమచ్చలు మంచి అదృష్టాన్ని ఇస్తాయి. అయితే, కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో ఉన్న పుట్టుమచ్చలు వ్యతిరేక ఫలితాలను కూడా ఇవ్వవచ్చు. రక్తంతో కూడుకున్న పుట్టుమచ్చలు ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు.

ఇది చదవండి: ప్రతీ ఇంట్లో కరెంట్ బిల్లు రూ. 100 కూడా రాదు.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు

అదృష్ట పుట్టుమచ్చల స్థానాలు:

పురుషులకు:

కుడి కంఠంపై: అనుకూలమైన భార్య, అభివృద్ధి. కుడి పొట్టపై: భోజన ప్రియులు, ఆహార విషయాలపై ఆసక్తి. కుడి వెనుకభాగం(వీపు): గొప్ప ప్రాముఖ్యత, ఉన్నత స్థాయికి చేరుకోవడం. కుడి గడ్డంపై: కీర్తి ప్రతిష్టలు.

స్త్రీలకు:

ఎడమ కంటి మూల/కింద: హైలైట్ అయిన వ్యక్తిత్వం ఎడమ పెదవి కింద: అనుకూలమైన ఫలితాలు. భుజాలపై: మంచి భర్త, అదృష్టం. నలుపు లేదా తేనె రంగు పుట్టుమచ్చలు శుభప్రదం.

ఇది చదవండి: పోలీసులు థర్డ్ డిగ్రీ ఎప్పుడు ఉపయోగిస్తారంటే.? ఎవ్వరికీ తెలియని నిజం..

ప్రతికూల పుట్టుమచ్చల స్థానాలు:

పురుషులకు:

ముక్కుపై: కోప స్వభావం, ఇబ్బందులు. ఎడమ చేతిపై: ఆరోగ్య సమస్యలు. ఎడమ చెవిపై: దూర ప్రయాణాలు(విదేశాలు) చేసే అవకాశం ఉన్నా, అక్కడ ఇబ్బందులు.

స్త్రీలకు:

కుడి కనురెప్పపై: మానసిక ఒత్తిడి, నిద్రలేమి. ఎడమ కాలు చిటికెన వేలుపై: ఎక్కువగా ప్రయాణాలు, తిరుగుడు. కుడి చేతిపై, ఎడమ వీపుపై: భర్తతో గొడవలు, ప్రతికూలతలు.

పుట్టుమచ్చలు వ్యక్తి జీవితాన్ని 100 శాతం నిర్ణయించవు. ఇవి జ్యోతిష్య శాస్త్రంలో ఒక భాగం మాత్రమే. జాతకం, హస్తసాముద్రికం వంటి ఇతర అంగాములతో కలిపి పుట్టుమచ్చల ప్రభావం 10-15 శాతం వరకు ఉంటుందని స్పష్టం చేశారు. ఒక పుట్టుమచ్చ ఉన్నంత మాత్రాన అందరూ గొప్ప స్థాయికి చేరుకోలేకపోవచ్చు, ఎందుకంటే వారి జాతక ఫలితాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

ఇది చదవండి: మీరు దరిద్రంలో ఉన్నారా..? అయితే మీ చెప్పులను అక్కడ వదిలిస్తే డబ్బే డబ్బు..

Disclaimer: ఈ వార్తలోని సమాచారం వాస్తు శాస్త్రం, జ్యోతిష్యం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.

Follow Us
సొంతింటికే నిప్పు పెట్టాడు..అక్కడే కుర్చీ వేసుకొని కూర్చుకున్నాడు
సొంతింటికే నిప్పు పెట్టాడు..అక్కడే కుర్చీ వేసుకొని కూర్చుకున్నాడు
కూల్‌ డ్రింక్స్‌తో చిప్స్‌ కాంబినేషన్‌ మీకూ ఇష్టమా..?
కూల్‌ డ్రింక్స్‌తో చిప్స్‌ కాంబినేషన్‌ మీకూ ఇష్టమా..?
కోహ్లీ రికార్డు ఫసక్.. టార్గెట్ ధోనీ.. రోహిత్ సరికొత్త చరిత్ర..!
కోహ్లీ రికార్డు ఫసక్.. టార్గెట్ ధోనీ.. రోహిత్ సరికొత్త చరిత్ర..!
ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవం..
ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవం..
టెక్నాలజీ వాడి హత్య చేశారు.. సైలెంట్‌గా సైడ్ అవ్వాలనుకున్నారు..
టెక్నాలజీ వాడి హత్య చేశారు.. సైలెంట్‌గా సైడ్ అవ్వాలనుకున్నారు..
ఈ సంగతి తెలుసా..? పగలే కాదు.. రాత్రిళ్లు కూడా వడదెబ్బ తగులుతుందట!
ఈ సంగతి తెలుసా..? పగలే కాదు.. రాత్రిళ్లు కూడా వడదెబ్బ తగులుతుందట!
ఇకపై మాంసాహారం అక్కర్లేదు.. బి12 విటమిన్ లోపానికి చెక్ పడినట్టే!
ఇకపై మాంసాహారం అక్కర్లేదు.. బి12 విటమిన్ లోపానికి చెక్ పడినట్టే!
ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు కోరిన విజయ్..
ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు కోరిన విజయ్..
చూడటానికి పావురంలా ఉంది అనుకునేరు..
చూడటానికి పావురంలా ఉంది అనుకునేరు..
జుట్టు, గోళ్లు కత్తిరించినప్పుడు నొప్పి కలగకపోవడానికి కారణం ఏంటి?
జుట్టు, గోళ్లు కత్తిరించినప్పుడు నొప్పి కలగకపోవడానికి కారణం ఏంటి?