AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Premenopause: నెలసరి పూర్తిగా ఆగిపోయే ముందు.. ఒంట్లో కనిపించే లక్షణాలు ఇవే

స్త్రీ జీవితంలో బాల్యం, కౌమారం, గర్భధారణ ఎంత సహజమైన దశలో, 'మెనోపాజ్' (ఋతుక్రమం ఆగిపోవడం) కూడా అంతే సహజమైన మరియు అనివార్యమైన దశ. అయితే చాలా మంది మహిళలు ఈ దశను ఎదుర్కొనేటప్పుడు తీవ్రమైన శారీరక మరియు మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. న్యూట్రిషనిస్ట్ వనిజ రామిశెట్టి గారు ఒక ఇంటర్వ్యూలో తెలిపిన ప్రకారం, మెనోపాజ్ దశ అనేది ఒక మహిళ అంతకుముందు లీడ్ చేసిన లైఫ్ స్టైల్ పై ఆధారపడి ఉంటుంది.

Phani CH
|

Updated on: Jun 14, 2026 | 9:45 PM

Share
జీవితాన్ని సంతోషంగా గడిపిన మహిళలు ఈ దశను సులభంగా దాటగలరు, కానీ తీవ్రమైన ఒత్తిడి, భావోద్వేగాలను అణచివేసుకున్న వారికి ఈ సమయంలో మూడ్ స్వింగ్స్, మానసిక ఆందోళనలు వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. మెనోపాజ్ వచ్చే ముందు (ప్రీమెనోపాజ్) మహిళల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల ఆకస్మికంగా ఒళ్లు వేడెక్కడం (హాట్ ఫ్లషెస్), విపరీతంగా చమటలు పట్టడం, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు మరియు అలసట వంటి శారీరక లక్షణాలు కనిపిస్తాయి.

1 / 5
వీటితో పాటు చిన్న విషయాలకే విపరీతమైన కోపం రావడం, చిరాకు పడటం, కొన్నిసార్లు బాధ్యతల నుంచి పారిపోవాలనే ఆలోచనలు కూడా రావచ్చు. ఈ సమయంలో జీర్ణక్రియ కూడా మందగిస్తుంది. పాలు తాగినా, పప్పు ధాన్యాలు తిన్నా కడుపు ఉబ్బరం (బ్లోటింగ్) వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ మార్పులన్నీ హార్మోన్ల వల్ల జరుగుతున్నాయని గ్రహించి, మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

2 / 5
మెనోపాజ్ దశను సులభంగా అధిగమించడానికి మహిళలకు 50 శాతం కుటుంబ మద్దతు చాలా అవసరం. గత పాతికేళ్లుగా కుటుంబం కోసం కష్టపడిన మహిళ, ఈ దశలో వింతగా ప్రవర్తిస్తుంటే ఆమెను అర్థం చేసుకునే భర్త, పిల్లలు ఉండాలి. ఆమెకు మానసిక ధైర్యాన్ని ఇవ్వడం ద్వారా ఈ ఫేజ్ ని ఈజీగా దాటవచ్చు. ఇక ఆహారం విషయానికొస్తే, శరీరంలో కాల్షియం మరియు ప్రోటీన్ శోషణ తగ్గుతుంది కాబట్టి, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

3 / 5
రాగులు, వాల్‌నట్స్, గుమ్మడికాయ గింజలు, తెల్ల మరియు నల్ల నువ్వులను రోజూ డైట్ లో చేర్చుకోవాలి. జీర్ణక్రియను బట్టి పాలు లేదా మజ్జిగ, నానబెట్టిన పల్లీలు వంటివి తీసుకోవడం మంచిది. ఆహారంతో పాటు ప్రతిరోజూ కాన్షియస్ గా దీర్ఘ శ్వాస తీసుకోవడం (డీప్ బ్రీతింగ్) అలవాటు చేసుకోవాలి. ఇది మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంచి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.

4 / 5
జిమ్‌కు వెళ్లకపోయినా ఇంట్లోనే చిన్న చిన్న స్ట్రెంత్ ట్రైనింగ్ మరియు ఎక్సర్‌సైజులు చేయడం ద్వారా మజిల్ లాస్ కాకుండా చూసుకోవచ్చు. డయాబెటిస్, బీపీ, థైరాయిడ్ వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే శారీరక శ్రమ తప్పనిసరి. తిన్న ఆహారం సక్రమంగా అరిగి, కడుపు తేలికగా ఉండేలా చూసుకోవాలి. ఇతరుల విషయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టకుండా, తమ సొంత ఆరోగ్యం మరియు నిద్రపై శ్రద్ధ పెట్టడం ద్వారా మహిళలు ఈ దశలోనూ ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా జీవించగలరు.

5 / 5
Follow Us