AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పుడు టాలీవుడ్ లవర్ బాయ్.. నీట్ ఉద్యమంలో పాల్గొన్న ఈ ఏకైక తెలుగు హీరోను గుర్తుపట్టారా?

నీట్ పేపర్ లీక్ పై దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికిన సంగతి తెలిసిందే. పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలకు వ్యతిరేకంగా లక్షలాది మంది విద్యార్థులు నిరసన చేపట్టారు. అయితే ఈ విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా ఒకప్పటి టాలీవుడ్ హీరో కూడా గళమెత్తాడు.

Tollywood: ఒకప్పుడు టాలీవుడ్ లవర్ బాయ్.. నీట్ ఉద్యమంలో పాల్గొన్న ఈ ఏకైక తెలుగు హీరోను గుర్తుపట్టారా?
Tollywood Actor
Basha Shek
|

Updated on: Jul 26, 2026 | 12:45 PM

Share

దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక జంతర్ మంతర్ వేదికగా గళం విప్పిన జెన్‌జీ ఆందోళనలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలకు వ్యతిరేకంగా వేలాది మంది విద్యార్థులు, యువకులు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. అలాగే ప్రతిపక్ష పార్టీల నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు కూడా ఈ నిరసనల్లో భాగమయ్యారు. విద్యార్థులకు మద్దతుగా తమ గొంతు వినిపించారు. మరికొంత మంది సినీ ప్రముఖులు కూడా సామాజిక మాధ్యమాల వేదికగా విద్యార్థుల ఆందోళనళనకు మద్దతిచ్చారు. అయితే ఈ విద్యార్థుల నిరసనల్లో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక ప్రముఖ నటుడు ప్రత్యక్షంగా పాల్గొనడం అందరినీ ఆకర్షించింది. గతంలో పలు తెలుగు హిట్ సినిమాల్లో నటించిన ఆ హీరో ఇప్పుడు జంతర్ మంతర్ వద్దవిద్యార్థులతో కలిసి నిరసనల్లో పాల్గొన్నారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు అత్యవసరమని, విద్యార్థుల భవిష్యత్తుతో ఎవరూ ఆటలాడకూడదని వారికి మద్దతుగా గళమెత్తాడు. ఇందుకు సంబంధించిన ఫొటలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. పై ఫొటో అదే. మరి ఇంతకీ అతనెవరో గుర్తు పట్టారా?

2002లో వచ్చిన ‘లాహిరి లహిరి లాహిరి’ సినిమా గుర్తుందా? అందులో నటించిన హీరో ఆదిత్య ఓమ్ యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదటి చిత్రంతోనే లవర్ బాయ్‌ ట్యాగ్ తెచ్చుకున్నాడు. దీని తర్వాత కూడా పలు హిట్ సినిమాల్లో నటించాడు ఆదిత్య ఓమ్. అయితే ఎక్కువ కాలం హీరోగా కెరీర్ కొనసాగించలేకపోయాడు. వరుసగా పరాజయాలు ఎదురుకావడంతో సినిమాలకు దూరమయ్యారు. 2013లో ‘బందూక్’ అనే సినిమాకు దర్శకత్వం వహించిన ఆదిత్య ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 8’ లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. తన నిజయతీతో అందరి మనసులు గెల్చుకున్నాడు. సినిమాలు, టీవీ షోల సంగతి పక్కన పెడితే..ఆదిత్య ఓం పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. ముఖ్యంగా పేద విద్యార్థుల కోసం తన వంతు సాయం చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తు కోసం జంతర్ మంతర్ వద్ద గొంతెత్తాడు. బహుశా.. టాలీవుడ్ నుంచి ఈ ఆందోళనల్లో పాల్గొన్నది ఆదిత్య ఓం ఒక్కరేనేమో!

ఇవి కూడా చదవండి

జంతర్ మంతర్ వద్ద హీరో ఆదిత్య ఓమ్..

View this post on Instagram

A post shared by Aditya Om (@theadityaom)

ఆదిత్య ఓమ్ లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Aditya Om (@theadityaom)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కలల కోసం అమెరికా.. క్షణాల్లో కూలిన జీవితం..!
కలల కోసం అమెరికా.. క్షణాల్లో కూలిన జీవితం..!
నీట్ ఉద్యమంలో పాల్గొన్న ఈ ఏకైక తెలుగు హీరోను గుర్తుపట్టారా?
నీట్ ఉద్యమంలో పాల్గొన్న ఈ ఏకైక తెలుగు హీరోను గుర్తుపట్టారా?
అర్ధరాత్రి అలజడి.. రోడ్డుపై ఒక్కసారిగా నిలిచిపోయిన వాహనాలు..
అర్ధరాత్రి అలజడి.. రోడ్డుపై ఒక్కసారిగా నిలిచిపోయిన వాహనాలు..
మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదేనా? పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలిస్తే
మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదేనా? పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలిస్తే
సింహం వేటను ఎలా చంపుతుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
సింహం వేటను ఎలా చంపుతుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
వాచ్‏లో జెండా రంగులు.. రూ. 41 లక్షల వాచ్ గురించి తెలిస్తే..
వాచ్‏లో జెండా రంగులు.. రూ. 41 లక్షల వాచ్ గురించి తెలిస్తే..
21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ..! సీఎం రేవంత్ కీలక ప్రకటన
21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ..! సీఎం రేవంత్ కీలక ప్రకటన
విమానంలో త్రిష లాగా 'షీట్ మాస్క్' వాడుతున్నారా? ఈ విషయాలు తెలుసా
విమానంలో త్రిష లాగా 'షీట్ మాస్క్' వాడుతున్నారా? ఈ విషయాలు తెలుసా
చాతుర్మాసంలో ఈ పరిహారాలు పాటించండి.. జీవితంలో శుభఫలితాలు..
చాతుర్మాసంలో ఈ పరిహారాలు పాటించండి.. జీవితంలో శుభఫలితాలు..
ఇంట్లో కూర్చొనే నెలకు 20వేల సంపాదన.. ఈ సూపర్ స్కీమ్ గురించి..
ఇంట్లో కూర్చొనే నెలకు 20వేల సంపాదన.. ఈ సూపర్ స్కీమ్ గురించి..