ఉదయాన్నే టీ తాగేటప్పుడు అస్సలే చేయకూడని తప్పులు ఇవే

Samatha

24 July 2026

టీ అంటే ఇష్టం లేని వారు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రతి ఒక్కరూ ఉదయం అయ్యిందంటే చాలు కప్పు టీ తాగడానికి ఆసక్తి చూపుతారు.

ఇంకొంత మంది అయితే ఉదయం టీ తాగనిదే, ఆరోజే గడవనట్లు ఉంటుందని చెప్పుకొస్తారు. అంతలా టీని ఇష్టపడుతుంటారు.

అయితే ఉదయం టీ తాగే సమయంలో అస్సలే కొన్ని తప్పులు చేయకూడదంటున్నారు నిపుణులు. అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం.

ఎప్పుడూ కూడా పరగడుపున  టీ తాగకూడదు. ఇలా తాగడం వలన ఇది గ్యాస్, ఎసిడిటీ, వంటి సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంది.

అంతే కాకుండా ఎప్పుడూ కూడా పాలు, చక్కెర ఎక్కువగా వేసిన టీ తాగకూడదు. దీని వలన చాలా త్వరగా బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది.

కొంత మంది పడుకొని లేచిన వెంటనే వేడి వేడి టీ ఎక్కువగా తాగుతుంటారు. ఇది అనారోగ్య సమస్యలకు కారణం అవుతుందంట.

ఇక కొంత మంది టీ తాగిన వెంటనే, స్నానం చేయడం చేస్తుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదు, బీపీ పడిపోయే ఛాన్స్ ఉన్నదంట.

అలాగే టీతో పాటు ఎప్పుడూ కూడా పార్లే జీ,  మైదా, చక్కెర ఎక్కువగా ఉండేవి తినకూడదు. ఇది కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు కారణం అవుతుంది.