AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎల్ నినో భయంకరమైన సవాల్.. వేడి ఎక్కువ, వర్షం తక్కువ..

ఎల్ నినో భయంకరమైన సవాల్.. వేడి ఎక్కువ, వర్షం తక్కువ..

Phani CH
|

Updated on: Jun 14, 2026 | 5:06 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, ఎండలు కలిసి భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచనలు జారీ చేసిన వాతావరణ శాఖ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. హైదరాబాద్‌లో భారీ వర్షాలు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించగా, రైతులకు ఉపశమనం లభించింది. మరోవైపు సూపర్ ఎల్‌నినో ప్రభావంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఓ వైపు ఎండలు, మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి.. నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండటంతో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో శనివారం ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో శనివారం పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మన్యం, అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. దీంతో పాటు ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ పరిధిలోని జిల్లాల్లో కూడా పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చంటోందో వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో వర్షం పడే సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కాకపోయినా, ఓ మోస్తరు జల్లులతో జిల్లాలోని వాతావరణం పూర్తిగా చల్లబడింది. కర్నూలు నగరంతో పాటు దాదాపు అన్ని గ్రామీణ ప్రాంతాలలో వర్షం పడ్డాయి. ఎండ తీవ్రతకు ఎండిపోతున్న పంటలకు ఈ అకాల వర్షాలు… ఎంతో మేలు చేకూర్చాయి. దీంతో రైతన్నల్లో ఆనందం వ్యక్తమవుతోంది. చాలా రోజుల తర్వాత వాతావరణం ఇలా ప్రశాంతంగా మారడంతో జిల్లా ప్రజలు తీవ్రమైన ఉక్కపోత నుండి ఉపశమనం పొందారు. మార్కాపురం పరిసర ప్రాంతాల్లో శనివారం ఉదయం నుండి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఉదయం నుంచే ఆకాశం పూర్తిగా మేఘావృతమై, నిరంతరాయంగా పడుతున్న వర్షంతో వాతావరణం అంతా ఒక్కసారిగా చల్లబడింది. చాలా రోజుల తర్వాత కురుస్తున్న ఈ వర్షం వల్ల స్థానిక ప్రజలకు ఎండల తీవ్రత, ఉక్కపోత నుండి పెద్ద ఉపశమనం లభించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో కురిసిన వర్షాలతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. ముఖ్యంగా రాజోలు దీవిలో తెల్లవారుజాము నుంచే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడటంతో ప్రజలకు పెద్ద ఉపశమనం లభించింది. కాకినాడ ,రాజోలులోని పలు ప్రాంతాల్లో రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు కొంత మేర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈ ఆకస్మిక వర్షాలు ఇక్కడి ప్రధాన జీవనాధారమైన కొబ్బరి పంటలకు ఎంతో మేలు చేకూరుస్తాయని స్థానిక రైతులు సంతోషపడుతున్నారు. హైదరాబాద్‌ను శుక్రవారం భారీ వర్షం ముంచెత్తింది. నగరవ్యాప్తంగా కురిసిన వర్షానికి రహదారులు చెరువుల్లా మారాయి. రోడ్లపై నిలిచిన వరదతో వాహనదారులకు నరకం కనిపించింది. గంటలపాటు నిలిచిన ట్రాఫిక్‌తో అవస్థలు పడ్డారు. చాలా ప్రాంతాల్లో ఈదురుగాలుల బీభత్సానికి చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. బంజారాహిల్స్, వెంగళరావు పార్క్ దగ్గర చెట్టు విరిగిపడడంతో ఐదు బైకులు ధ్వంసమయ్యాయి. హైదరాబాద్, మేడ్చల్‌, మహబూబాబాద్, నిజామాబాద్.. రంగారెడ్డి, వరంగల్‌, యాదాద్రికి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణశాఖ. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో గత రెండు రోజుల నుండి దంచికొడుతున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా అచ్చంపేట మండలం చౌటపల్లి గ్రామ సమీపంలోని వాగుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రవాహం తీవ్ర రూపం దాల్చింది. ఈ ఉధృతి కారణంగా చౌటపల్లి గ్రామం నుండి చౌటపల్లి తండాకు వెళ్లే దారిలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దేశ వ్యవసాయ రంగాన్ని ఎల్‌నినో చుట్టుముడుతోంది. దేశానికి అత్యధిక వర్షాలు అందించే నైరుతి రుతుపవనాలు ఇప్పటికే ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి. వచ్చిన తర్వాత కూడా వేగంగా విస్తరించటం లేదు. రెండుమూడేళ్లకోసారి ఎల్‌నినో పరిస్థితులు ఏర్పటం సర్వసాధారణమే అయినా.. ఈసారి వచ్చింది సూపర్‌ ఎల్‌నినో అని, దాని ప్రభావం దారుణంగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ఎల్‌నినో నేరుగా జనం కడుపు కొట్టేలా ఉంది. దేశంలోని సుమారు 197 జిల్లాలపై ఎల్‌నినో ప్రభావం ఉండబోతోందని కేంద్ర వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పట్టుతప్పి కిందపడ్డా.. చనిపోయేదాన్నే.. కానీ గైడ్‌ వల్ల బతికాను..

వేద విద్యార్ధి ఆవేదన.. రూ.8 వేల కోసం..

మనీ మెషీన్‌! 90 నిమిషాల్లో రూ.30 కోట్లు సంపాదన

వైరల్‌ వీడియోలే వరుడికి విలన్‌లయ్యాయి.. షాక్ తిన్న పెళ్లి బృందం!

రైతులకు మేలు చేసే వయ్యారి భామ మళ్లీ దర్శనం..!

Follow Us