AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పట్టుతప్పి కిందపడ్డా.. చనిపోయేదాన్నే.. కానీ గైడ్‌ వల్ల బతికాను..

పట్టుతప్పి కిందపడ్డా.. చనిపోయేదాన్నే.. కానీ గైడ్‌ వల్ల బతికాను..

Phani CH
|

Updated on: Jun 14, 2026 | 4:55 PM

Share

తమిళ దిగ్గజ నటుడు జెమిని గణేశన్ మనవరాలు డాక్టర్ ప్రియా సెల్వరాజ్ 52 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి అరుదైన ఘనత సాధించారు. వైద్యురాలిగా బాధ్యతలు నిర్వహిస్తూనే కఠోర శిక్షణతో ఈ లక్ష్యాన్ని చేరుకున్నారు. ప్రాణాపాయ పరిస్థితులు, ఆక్సిజన్ కొరతను ఎదుర్కొని శిఖరాన్ని చేరిన ఆమె యువతకు శారీరక దృఢత్వం, సంకల్పబలంపై స్ఫూర్తిదాయక సందేశాన్ని అందించారు.

తమిళ దివంగత నటుడు జెమిని గణేశన్ మనవరాలైన డాక్టర్ ప్రియా సెల్వరాజ్ 52 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ప్రియా 2026 మే 27న ఈ ఫీట్‌ను అందుకున్నారు. పూర్తిగా మంచుతో కప్పుకుపోయిన మార్గాలు, ప్రాణాలకు ప్రమాదంగా మారే వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ శిఖరాన్ని చేరుకోవడం అంత అషామాషీ కాదు. డాక్టర్‌గా బాధ్యతలు, పని గంటలు, మానసిక అలసట మధ్య పర్వతారోహణ ట్రైనింగ్ తీసుకున్నట్లు చెప్పారు. అందుకోసం తను పూర్తిగా కోచ్‌పై ఆధారపడ్డాననీ తను నిజమైన పర్వతాలను ఎక్కుతూ శిక్షణ తీసుకోలేదనీ దానికి బదులుగా ఇల్లు, ఆస్పత్రి, ఫ్లైఓవర్ల మెట్లు ఎక్కడం ద్వారా శిక్షణ పొందినట్లు చెప్పారు. 45 రోజుల్లో అంత పెద్ద పర్వతాన్ని అధిరోహించడానికి శిక్షణ పొందడంలో అది తనకు సహాయపడిందనీ అన్నారు. నేపాల్ రాజధాని కాఠ్‌మాండూకి తిరిగి వచ్చే మార్గంలో తన శరీరంలో మార్పులను గమనించాననీ అక్కడి నుంచి చెన్నైకి చేరుకున్న తర్వాత ఒళ్లు నొప్పులు, జ్వరం వచ్చాయన్నారు. ఎవరెస్ట్ శిఖరాగ్రానికి చేరుకుని తిరిగి వస్తున్నప్పుడు కింద పడిపోయాననీ ట్రైనర్లు వెంటనే రక్షించారనీ చెప్పారు. గైడ్ సూచనలతో తాడు కట్టుకోవడంతో బతికానని.. లేదంటే చనిపోయేదాన్నని అన్నారు. తనకు పునర్జన్మ లభించినట్లు అనిపిస్తోందన్నారు. యువత ఎక్కువగా ఇంట్లోనే ఉంటూ మొబైల్ ఫోన్లలో మునిగిపోతుంటారు దానికి బదులుగా వారు శారీరక వ్యాయామం చేయాలి. శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకోవాలి అని ప్రియా సెల్వరాజ్ సూచించారు. మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించడం కష్టమైన లక్ష్యమే అయినా, తాను ఈ ప్రయాణాన్ని దృఢ సంకల్పంతో, ఆధ్యాత్మిక నిబద్ధతతో చేపట్టానని డాక్టర్ ప్రియా సెల్వరాజ్ తెలిపారు. తనకు 2021లోనే ఎవరెస్ట్ పర్వతారోహణ చేయాలనే ఆలోచన వచ్చిందని కఠోర శిక్షణ, కుటుంబసభ్యుల మద్దతు వల్లే ఈ జర్నీ సాధ్యమైందన్నారు. ఎనిమిది రోజుల్లో పర్వతాన్ని అధిరోహించి రికార్డు సృష్టించారు. ఆరుగురు మహిళలు, ఆరుగురు పురుషులతో మొత్తం 12 మంది యాత్రను ప్రారంభించారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే క్రమంలో ఆక్సిజన్ కొరత సమస్య ఎదుర్కొన్నారు. డాక్టర్ ప్రియా సెల్వరాజ్ చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రి డైరెక్టర్, సంతాన సాఫల్య నిపుణురాలిగా సేవలందిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వేద విద్యార్ధి ఆవేదన.. రూ.8 వేల కోసం..

మనీ మెషీన్‌! 90 నిమిషాల్లో రూ.30 కోట్లు సంపాదన

వైరల్‌ వీడియోలే వరుడికి విలన్‌లయ్యాయి.. షాక్ తిన్న పెళ్లి బృందం!

రైతులకు మేలు చేసే వయ్యారి భామ మళ్లీ దర్శనం..!

Follow Us