సిరిసిల్ల జిల్లాలోని మానేరు వాగు కాజ్‌వేపై వరద ప్రవాహం ఉధృతంగా ఉంది. నాచు పట్టి ప్రమాదకరంగా మారిన రోడ్డుపై నుంచి వెళ్లేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులు బైక్‌తో సహా నీటిలో కొట్టుకుపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు తాడుల సహాయంతో వారి ప్రాణాలను కాపాడారు. అధికారులు వరద తగ్గే వరకు వాగు దాటవద్దని హెచ్చరిస్తున్నారు.