దేవరకొండ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు అందిస్తున్న విద్యా సహాయంపై స్టార్ హీరోయిన్ రష్మిక మందన మాట్లాడారు. విజయ్ సొంత ఊరి నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జీవితంలో గెలుపోటములు సహజమని, ప్రతి అనుభవం నుంచి నేర్చుకోవాలని ఆమె సూచించారు. నవ్వుతూ కష్టపడి చదువుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విద్యార్థులకు భావోద్వేగంగా పిలుపునిచ్చారు.