AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భలే మంచి రోజు.. ఒకేరోజు ఎన్ని అప్‌డేట్స్ వచ్చాయో తెలుసా..?

భలే మంచి రోజు.. ఒకేరోజు ఎన్ని అప్‌డేట్స్ వచ్చాయో తెలుసా..?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jun 14, 2026 | 7:45 PM

Share

జూన్ 12 తెలుగు సినీ పరిశ్రమలో అప్‌డేట్ల వర్షం కురిపించింది. సత్యదేవ్ నటించిన రావ్ బహదూర్ టీజర్ విడుదల కావడంతో పాటు గోపీచంద్ కొత్త సినిమాల వివరాలు బయటకు వచ్చాయి. కిరణ్ అబ్బవరం దర్శకుడిగా కొత్త ప్రయాణం మొదలుపెట్టగా, శర్వానంద్-సంపత్ నంది భోగి కొత్త షెడ్యూల్ కూడా ప్రారంభమైంది. ఒకేరోజు వచ్చిన వరుస అప్‌డేట్స్‌తో టాలీవుడ్ సందడిగా మారింది.

ఒక్కోరోజు ఇండస్ట్రీలో ఏ అప్‌డేట్ ఉండదు.. సందడే కనిపించదు. సినిమాల్లేక సైలెంట్‌గా ఉంటుంది. కానీ ఒక్కోరోజు మాత్రం ఒకేసారి మూడు నాలుగు అప్‌డేట్స్‌ వచ్చేస్తుంటాయి. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అంటుంటారు కదా.. అదే జరుగుతుంది. తాజాగా అతివృష్టి అన్నమాట. మరి ఆ టీజర్స్ సందడేంటి.. కొత్త సినిమాల ముచ్చట్లేంటో చూద్దామా..? జూన్ 12.. తెలుగు ఇండస్ట్రీకి మంచిరోజు అనుకుంటా.. ఒకేరోజు చాలా అప్‌డేట్స్ వచ్చేసాయి. ఓ వైపు అనిల్ రావిపూడి తన సినిమా ప్రమోషనల్ వీడియో విడుదల చేస్తే.. మరోవైపు సత్యదేవ్ హీరోగా మహేష్ బాబు నిర్మిస్తున్న రావ్ బహదూర్ టీజర్ వచ్చింది. ఈ చిత్ర కథ నచ్చి స్వయంగా సూపర్ స్టార్ తన GMB ఎంటర్‌టైన్మెంట్స్‌లో సినిమాను సమర్పిస్తున్నారు. గోపీచంద్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమాల ముచ్చట్లు చెప్పారు మేకర్స్. సంకల్ప్ రెడ్డితో చేస్తున్న భరతవర్ష షూట్ వేగంగా నడుస్తుంటే.. వి వెంకట్ దర్శకత్వంలో చేస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సింగా అనే టైటిల్ ఖరారు చేసారు. చిన్న గ్లింప్స్ కూడా ఇచ్చారు. ఈ సినిమాకు శ్రీకర్ ప్రసాద్, స్యామ్ సిఎస్ లాంటి టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. టీజర్స్ మాత్రమే కాదు.. ఓపెనింగ్ ముచ్చట కూడా జూన్ 12నే జరిగింది. ఇన్నాళ్లూ హీరోగా మెప్పించిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు దర్శకుడిగా మారారు. ఆయన తెరకెక్కిస్తున్న సినిమా ఓపెనింగ్ కూడా ఇప్పుడే జరిగింది. ఇక సంపత్ నంది, శర్వానంద్ కాంబోలో వస్తున్న భోగి సినిమా కొత్త షెడ్యూల్‌ను జూన్ 12నే మొదలుపెట్టారు. మరి ఈ సందడి రాబోయే రోజుల్లోనూ ఇలాగే కంటిన్యూ చేస్తారా..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టాలీవుడ్‌కే టైం బాంబ్‌లా..రూ.1000 కోట్ల కల

Peddi: పెద్ది హిట్టా..? ఫట్టా..? ఫైనల్‌గా కలెక్షన్స్‌ ఏం చెబుతున్నాయి?

పెంపుడు కుక్క మృతి.. తిరిగిరాని చిన్నారి.. 500 ఎకరాల్లో జల్లెడ

ఎల్ నినో భయంకరమైన సవాల్.. వేడి ఎక్కువ, వర్షం తక్కువ..

పట్టుతప్పి కిందపడ్డా.. చనిపోయేదాన్నే.. కానీ గైడ్‌ వల్ల బతికాను..

Follow Us