తిరుపతి జిల్లాలోని రామచంద్రాపురం మండలంలో అర్ధరాత్రి మూడు దేవాలయాల్లో దొంగలు రెచ్చిపోయారు. చల్లవారిపల్లి ముత్యాలమ్మ గుడిలో సీసీ కెమెరాలను వెనక్కి తిప్పి ఎనిమిది గ్రాముల బంగారు కాసులు, 20 వేల నగదు దోచుకెళ్లారు. సమీపంలోని రాముల వారి ఆలయంలోనూ 2 వేల రూపాయలు అపహరించారు. ఈ వరుస చోరీలతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.