AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పోలీసులు థర్డ్ డిగ్రీ ఎప్పుడు ఉపయోగిస్తారంటే.? ఎవ్వరికీ తెలియని నిజం..

పోలీసుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు థర్డ్ డిగ్రీ అనే పదం తరచుగా వినిపిస్తుంది. సమాజంలో దీని గురించి ఓ భయం ఉంది. ఒక భయానకమైన వర్ణన ఉంది. ఇది సాధారణంగా అతిగా ఉండే విచారణ పద్ధతిగా భావించినప్పటికీ, చట్టబద్ధంగా దీనికి అనుమతి లేదన్నారు సీనియర్ అధికారులు. సాధారణంగా, పోలీసులు ఇంటరాగేషన్ లేదా శృతిమించిన ఇంటరాగేషన్ నే థర్డ్ డిగ్రీ అని చాలామంది భావిస్తారు.

Telangana: పోలీసులు థర్డ్ డిగ్రీ ఎప్పుడు ఉపయోగిస్తారంటే.? ఎవ్వరికీ తెలియని నిజం..
Police Custody
Ravi Kiran
|

Updated on: Mar 11, 2026 | 4:59 PM

Share

పోలీసు విచారణలో ఉపయోగించే థర్డ్ డిగ్రీ పద్ధతులు, నేర పరిశోధనలో మోడస్ ఆపరేషన్ ప్రాముఖ్యత, ఇన్ఫార్మర్ల పాత్ర గురించి రిటైర్డ్ ఎస్పీ చెన్నంసెట్టి చక్రపాణి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించారు. పోలీసులకు దొరికిన నేరస్తుల నుంచి సమాచారం రాబట్టడానికి వివిధ పద్ధతులు ఉంటాయని ఆయన తెలిపారు. కొందరు నేరస్తులు సులభంగా ఒప్పుకొని వివరాలు చెబితే, మరికొందరు ఎంత కొట్టినా సహనంతో తట్టుకుంటారని పేర్కొన్నారు. అలాంటి మొండి నేరస్తుల విషయంలో ఒక ప్రత్యేక పద్ధతిని ఉపయోగిస్తామన్నారు. లుంగీ కట్టుకున్న దొంగను పట్టుకున్నప్పుడు, అతనికి ప్యాంట్ వేసి, లోపల ఒక తొండను వదిలేవాళ్లమని చక్రపాణి తెలిపారు. తొండ లోపల కొరుకుతూ ఉంటే, నేరస్తుడు తీవ్ర అసౌకర్యానికి గురై, ‘అయ్యా.. అయ్యా..’ అంటూ గెంతులు వేస్తూ నిజాలు చెప్పేవాడని వెల్లడించారు.

ఇది చదవండి: ప్రతీ ఇంట్లో కరెంట్ బిల్లు రూ. 100 కూడా రాదు.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు

ఈ పద్ధతిని వల్లాగి పట్టుగాడు అనే పొడవైన, బలశాలి అయిన దొంగపై ఉపయోగించినట్లు చెప్పారు. అతను ఎంత కొట్టినా లొంగకపోవడంతో, ఈ తొండ పద్ధతిని వాడగా, వెంటనే లొంగిపోయి వివరాలు చెప్పాడని వివరించారు. అయితే టైగర్ నాగేశ్వరరావు విషయంలో ఈ పద్దతి ఉపయోగించలేదని, కొందరు నేరస్తులు దెబ్బలు తినడం దేనికని భావించి తాము చెప్పేస్తామని ముందుకు వస్తారని చక్రపాణి తెలిపారు. టైగర్ నాగేశ్వరరావు కూడా అలాంటి మెంటాలిటీ ఉన్నవాడేనని, కొట్టేదాకా తెచ్చుకోకుండానే తాను చేసిన నేరాలను చెప్పేవాడని పేర్కొన్నారు. పోలీసులు అతడిని ఎందుకు చంపాల్సి వచ్చిందంటే, అతను ఒక లైసెన్స్ లేని రివాల్వర్ కొనుక్కున్నాడని వివరించారు.

పోలీసుల నేర పరిశోధనలో మోడస్ ఆపరేషన్(MO)కు చాలా ప్రాధాన్యత ఉంటుందని రిటైర్డ్ ఎస్పీ చక్రపాణి తెలిపారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా నేరాలు జరుగుతాయని, నేరస్తులు ఇండో బార్, రూఫ్ హోల్ లేదా లాక్ బ్రేకింగ్ వంటి వివిధ మార్గాలను ఉపయోగిస్తారని వివరించారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో మోడస్ ఆపరేషన్ ఇండెక్స్ ఉంటుందని, అందులో వివిధ నేరస్తుల అలవాట్లు నమోదై ఉంటాయని చెప్పారు. ఉదాహరణకు, కొందరు నేరస్తులు సంఘటన స్థలంలో అన్నాలు తిని వెళ్తే, మరికొందరు బాగా తినేసి అక్కడే పడుకుంటారని వివరించారు. ఈ సంకేతాలను బట్టి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, ఫింగర్ ప్రింట్లు లభిస్తే వాటిని డెవలప్ చేయిస్తారని లేదా నేరస్తుడి మోడస్ ఆపరేషన్‌ను బట్టి ఎవరు చేసి ఉంటారో అంచనా వేస్తారని తెలిపారు.

దీనికి అదనంగా, ఇన్ఫార్మర్ వ్యవస్థ కూడా నేర పరిశోధనలో అత్యంత కీలకమని ఆయన నొక్కి చెప్పారు. ఇన్ఫార్మర్ల ఖర్చుల కోసం పోలీసులు తమ జీతాల్లో కొంత భాగాన్ని కూడా వెచ్చిస్తారని, ఎస్పీ కూడా ఎస్ఆర్ అమౌంట్ పేరుతో డబ్బులు ఇస్తారని తెలిపారు. టైగర్ నాగేశ్వరరావు చిన్న చిన్న దొంగతనాలు చేయకుండా, బ్యాంకులు కొట్టడం వంటి సవాలుతో కూడిన నేరాలను చేసేవాడని అన్నారు. దొంగిలించిన డబ్బును దాచుకోకుండా, గ్రామాల్లో షావుకార్ల వలె పెళ్లిళ్లకు, మంగళసూత్రాలకు పంచేవాడని, తాను కూడా పాపులర్ అవ్వాలని, డబ్బు ఖర్చు పెట్టాలని కోరుకునేవాడని వివరించారు. అతని పబ్లిక్ రిలేషన్ ద్వారా దొరకడని, మంచి రన్నర్ అని కూడా తెలిపారు. ఈ విధంగా పోలీసుల విచారణ పద్ధతులు, నేరస్తుల ప్రవర్తన, ఇన్ఫార్మర్ వ్యవస్థ నేర పరిశోధనలో విడదీయరాని అంశాలుగా చక్రపాణి వివరించారు.

ఇది చదవండి: ఇంట్లో బీరువా ఈ దిక్కున పెడితే.. వద్దన్నా డబ్బు మీ ఇంటికి వస్తుంది

Follow Us
అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
రోజుకో రంగు మారే వింత పువ్వు.. నిన్న, నేడు, రేపు మొక్కను ఇంట్లోనే
రోజుకో రంగు మారే వింత పువ్వు.. నిన్న, నేడు, రేపు మొక్కను ఇంట్లోనే
నా బిడ్డకు తండ్రి అతనే.. 21 ఏళ్ల తర్వాత కుమారుడితో కలిసి ధర్నా..
నా బిడ్డకు తండ్రి అతనే.. 21 ఏళ్ల తర్వాత కుమారుడితో కలిసి ధర్నా..
మాడిన పాత్రలపై మసి పోవాలంటే.. ఈ కూరగాయలతో తలా తలా మెరిసిపోతాయ్
మాడిన పాత్రలపై మసి పోవాలంటే.. ఈ కూరగాయలతో తలా తలా మెరిసిపోతాయ్
విడాకుల విషయంలో తప్పంతా నాదే.. ఆమె నన్ను భరించలేకపోయింది..
విడాకుల విషయంలో తప్పంతా నాదే.. ఆమె నన్ను భరించలేకపోయింది..
వాహనదారులకు బిగ్ అలర్ట్.. నంబర్ ప్లేట్ తేడా ఉంటే క్రిమినల్ కేసే..
వాహనదారులకు బిగ్ అలర్ట్.. నంబర్ ప్లేట్ తేడా ఉంటే క్రిమినల్ కేసే..
ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారా?ఆఫీస్ గందరగోళాన్ని జయించడానికి సూత్రాలు
ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారా?ఆఫీస్ గందరగోళాన్ని జయించడానికి సూత్రాలు
సచిన్‌ vs కపిల్‌.. ‘ఆల్‌టైమ్‌ గ్రేట్‌’ ప్లేయర్ ఎవరు..?
సచిన్‌ vs కపిల్‌.. ‘ఆల్‌టైమ్‌ గ్రేట్‌’ ప్లేయర్ ఎవరు..?
భారత్-ఉజ్బెకిస్తాన్ వ్యూహాత్మక బంధం..!
భారత్-ఉజ్బెకిస్తాన్ వ్యూహాత్మక బంధం..!
అరటిపండు తిన్నాక నీళ్లు తాగితే మీ పొట్టలో ఏం జరుగుతుందో తెలుసా..?
అరటిపండు తిన్నాక నీళ్లు తాగితే మీ పొట్టలో ఏం జరుగుతుందో తెలుసా..?