తిరుపతి శేషాచలం అటవీ ప్రాంతానికి సమీపంలోని గ్రాండ్ వరల్డ్ లో చిరుతపులి సంచరించడం తీవ్ర కలకలం రేపింది. అర్ధరాత్రి ఇళ్ల దగ్గర తాగునీటి తొట్టి వద్దకు చిరుత రావడంతో స్థానికులు భయపడ్డారు. కొందరు వీడియోలు తీయగా, అటవీశాఖ అధికారులు నిఘా ఏర్పాటు చేశారు.