AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss: బిగ్ బాస్ హౌస్‌లోకి గాడిద.. షాక్‌లో ఆడియెన్స్.. వీడియో వైరల్‌.. అసలు విషయమిదే

బిగ్ బాస్ తెలుగు సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఆదివారం (అక్టోబర్ 06) నాటి ఎపిసోడ్‌ లో మరికొందరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగు పెట్టారు. దీంతో పాత, కొత్త కంటెస్టెంట్లతో హౌస్ ఇప్పుడు మరింత కళకళలాడుతోంది.

Bigg Boss: బిగ్ బాస్ హౌస్‌లోకి గాడిద.. షాక్‌లో ఆడియెన్స్.. వీడియో వైరల్‌.. అసలు విషయమిదే
Bigg Boss
Basha Shek
|

Updated on: Oct 07, 2024 | 11:51 AM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఆదివారం (అక్టోబర్ 06) నాటి ఎపిసోడ్‌ లో మరికొందరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగు పెట్టారు. దీంతో హౌస్ మరింత కళకళలాడుతోంది. ఇక వారం క్రితమే బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 మొదలైంది. ఇది కూడా ఉత్కంఠగా సాగుతోంది. ఇక దీని తర్వాత హిందీ బుల్లిెర అభిమానులను అలరించేందుకు ‘బిగ్ బాస్ హిందీ సీజన్ 18’ సిద్ధమైంది.ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ 18’ షో ఆదివారం (అక్టోబర్ 6) అట్టహాసంగా ప్రారంభమైంది. భిన్న రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కంటెస్టెంట్స్ గా హౌస్‌ లోకి అడుగు పెట్టారు. అయితే హిందీ బిగ్ బాస్ హౌస్ లోకి గాడిద కూడా ఎంట్రీ ఇచ్చింది. దీంతో కంటెస్టెంట్స్ తో పాటు ఆడియెన్స్ కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను కలర్స్ ఛానెల్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. అసలు బిగ్ బాస్ హౌస్‌ లోకి గాడిద రావడం ఏంటి? గాడిదను కూడా కంటెస్టెంట్ గా ఎంపిక చేశారా? గాడిదకు కూడా పారితోషకం ఇస్తారా ? అంటూ భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. మరి దీని వెనక ఉన్న అసలు సంగతేంటో చూద్దాం రండి.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ సీజన్ 8లోకి ప్రముఖ అడ్వకేట్ గుణరత్న సదావర్తే కంటెస్టెంట్ గా వచ్చాడు. ఇప్పుడు ఆయనతో పాటు ఆయన పెంచుకునే గాడిద కూడా హౌస్ లోకి అడుగు పెట్టింది. దీని పేరు మ్యాక్స్ అని సమాచారం. మొత్తానికైతే గుణరత్న సదావర్తే పాటు ఈ గాడిద కూడా బిగ్ బాస్ హౌస్ లో ఉండనుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనికి ఇతర కంటెస్టెంట్స్ అంగీకరిస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

బిగ్ బాస్ హౌస్ లో గాడిద..

కాగా గతంలో ‘బిగ్ బాస్ కన్నడ సీజన్ 10’లో ‘777 చార్లీ’ అనే కుక్క కనిపించనుందని ప్రచారం జరిగింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయితే కొన్ని కారణాలతో బిగ్ బాస్ హౌస్ లోకి కుక్క రాలేదు. ఒప్పందం కుదరకపోవడంతో ఆలస్యమైందని ఛానెల్ పేర్కొంది. ఆ తర్వాత రక్షిత్ శెట్టి స్వయంగా దీనిపై క్లారిటీ ఇచ్చాడు. “చార్లీని ఎక్కడికీ పంపడం లేదు” అన్నాడు స్పష్టమైన మాటలతో. దీంతో ఆ కుక్క బిగ్ బాస్ లోకి రాలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వయసు తేడా పెళ్లి చర్చనీయాంశం..70 ఏళ్ల వరుడి హనీమూన్ ప్లాన్ వైరల్!
వయసు తేడా పెళ్లి చర్చనీయాంశం..70 ఏళ్ల వరుడి హనీమూన్ ప్లాన్ వైరల్!
ఇరాన్‌పై దాడులకు సంబంధించి తొలి వీడియోను రిలీజ్ చేసిన ఇజ్రాయెల్
ఇరాన్‌పై దాడులకు సంబంధించి తొలి వీడియోను రిలీజ్ చేసిన ఇజ్రాయెల్
రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‏తో చిరంజీవి లైఫ్ మారిపోయింది..
రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‏తో చిరంజీవి లైఫ్ మారిపోయింది..
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్
రోజూ ఇడ్లీ, దోసెలేనా?.. పది నిమిషాల్లో 'మూంగ్లెట్' రెడీ
రోజూ ఇడ్లీ, దోసెలేనా?.. పది నిమిషాల్లో 'మూంగ్లెట్' రెడీ
Weekly Horoscope: వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు..
Weekly Horoscope: వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు..
ఇంట్లో పాలు విరిగిపోతున్నాయా? ఇలా చేస్తే రెండు రోజులు ఫ్రెష్‎గా
ఇంట్లో పాలు విరిగిపోతున్నాయా? ఇలా చేస్తే రెండు రోజులు ఫ్రెష్‎గా
జాతక దోషాలు తొలగించే ప్రదోష వ్రతం: మార్చిలో 3 ఏకంగా ప్రదోషాలు..!
జాతక దోషాలు తొలగించే ప్రదోష వ్రతం: మార్చిలో 3 ఏకంగా ప్రదోషాలు..!
భారత్ వెస్టిండీస్‌ను ఓడిస్తే.. సెమీఫైనల్ ఆడేది ఎప్పుడు?
భారత్ వెస్టిండీస్‌ను ఓడిస్తే.. సెమీఫైనల్ ఆడేది ఎప్పుడు?
భారత్-ఇరాన్ వ్యాపారం ఎంత పెద్దది? యుద్ధంతో ఎలాంటి ప్రభావం?
భారత్-ఇరాన్ వ్యాపారం ఎంత పెద్దది? యుద్ధంతో ఎలాంటి ప్రభావం?