AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 Telugu: ‘ఈసారి కప్పు కొట్టడం ఖాయం’.. బిగ్‌ బాస్‌లోకి సెకండ్‌ వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్‌గా టేస్టీ తేజ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రెండో వైల్డ్ కంటెస్టెంట్ గా ఫేమస్ యూట్యూబర్, నటుడు టేస్టీ తేజా హౌస్ లోకి అడుగు పెట్టాడు. ఫుడ్ వీడియోలతో ఫేమస్ యూబ్యూటర్ గా గుర్తింపు తెచ్చుకున్న గత బిగ్ బాస్ సీజన్ లోనూ కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు. తనదైన ఆటతీరుతో బుల్లితెర అభిమానులను అలరించాడు. తొమ్మిది వారాలపాటు హౌస్‌లో ఉండి వినోదం అందించాడు.

Bigg Boss 8 Telugu: 'ఈసారి కప్పు కొట్టడం ఖాయం'.. బిగ్‌ బాస్‌లోకి సెకండ్‌ వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్‌గా టేస్టీ తేజ
Tasty Teja
Follow us
Basha Shek

|

Updated on: Oct 06, 2024 | 9:06 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రెండో వైల్డ్ కంటెస్టెంట్ గా ఫేమస్ యూట్యూబర్, నటుడు టేస్టీ తేజా హౌస్ లోకి అడుగు పెట్టాడు. ఫుడ్ వీడియోలతో ఫేమస్ యూబ్యూటర్ గా గుర్తింపు తెచ్చుకున్న గత బిగ్ బాస్ సీజన్ లోనూ కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు. తనదైన ఆటతీరుతో బుల్లితెర అభిమానులను అలరించాడు. తొమ్మిది వారాలపాటు హౌస్‌లో ఉండి వినోదం అందించాడు. మరి ఇప్పుడు ఎనిమిదో సీజన్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా మళ్లీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈసారి బిగ్ బాస్ కప్పు కొట్టడం గ్యారంటీ అని ధీమాగా చెబుతున్నాడు టేస్టీ తేజ. ఈ సందర్భంగా ‘కప్పు కొట్టు బిగిల్’ అంటూ తల్లి అతనికి ఆశీర్వచనం అందించి హౌస్‌లోకి పంపించింది. మరి మాటల్లో చెప్పినట్లు టేస్టీ తేజ ఈ సారి బిగ్ బాస్ టైటిల్ గెలుస్తాడా? లేదా? అన్నది చూడాలి. ఈ సందర్భంగా టేస్టీ తేజా బెస్ట్ ఫ్రెండ్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ శోభా శెట్టి అతనికి బెస్ట్ విషెస్ చెప్పింది. కాగా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కోసం తన అమ్మ తయారు చేసిన పాల తాళికలను తీసుకొచ్చాడు టేస్టీ తేజ. అలాగే రెండు బౌల్స్ లో బిర్యానీ తీసుకుని మరీ హౌస్‌లోకి అడుగు పెట్టాడు. దీనిని యష్మీతో షేర్ చేసుకోవాలని చెప్పాడు.

బిర్యానీ బౌల్స్ తో బిగ్ బాస్ హౌస్ లోకి..

ఈ సందర్భంగా స్వాగ్ మూవీ టీమ్ బిగ్ బాస్ వేదికపై సందడి చేసింది. హీరో శ్రీ విష్ణు, హీరోయిన్లు రీతూ వర్మ, దక్ష నగార్కర్ బిగ్ బాస్ వేదికపై తమ సినిమా కబుర్లను అందరితో పంచుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి హౌస్ మేట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ తో గేమ్ ఆడించారు. ఈ గేమ్‌లో వైల్డ్‌కార్డ్‌‌ కంటెస్టెంట్లు హరి- టేస్టీ విజయం సాధించి రూ.20 లక్షలు ప్రైజ్‌మనీలో యాడ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

అప్పుడు 9 వారాలే.. ఈసారి మాత్రం కప్పు వదలను..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.